ఫేమస్ అవ్వడానికే అలా చేస్తున్నాడు.. రాకేష్ మాస్టర్‌కు మాధవీలత నోటీసులు
గత కొన్ని రోజులుగా రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీలపై కామెంట్స్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నాడు. హీరోలందరిపైనా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ.. వారి ఫ్యాన్స్‌ను సైతం ఏకి పారేస్తున్నాడు. ఈ కమ్రంలో శ్రీ రెడ్డి, మాధవీలత వంటి వారినిసైతం ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు. అయితే మాధవీలతపై చేసిన కామెంట్స్‌పై ఆమె రియాక్ట్ అయింది. బహిరంగ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులను పంపింది. ఇంతకీ ఈ వివాదం ఎలా మొదలైందో ఓ సారి చూద్దాం.

మాధవీలత ఫైర్..
తన డ్రెస్సింగ్ పైనా, తాను చేసే సేవా కార్యక్రమాలపైనా నెగెటివ్ కామెంట్స్ చేసే వారిని మాధవీలత ఫైర్ అయింది. మాధవీలత షేర్ చేసిన ఆ వీడియోపై రాకేష మాస్టర్ స్పందిస్తూ.. ఎవరిని నువ్ అలా అంటున్నావ్ అంటూ ఓ రేంజ్‌లో కామెంట్ చేశాడు.

రాకేష్ మాస్టర్ వీడియోలు వైరల్..
అలా వీరిద్దరి మధ్య వైరం మొదలైంది. మాధవీలత సినీ ప్రయాణం గురించి చెబుతూ అనేక విధాలుగా కామెంట్స్ చేశాడు. జఫ్పాదాన, ముదనష్టపుదాన అంటూ ఇలా ఇష్టమొచ్చినట్టు మాధవీలతను ధూషించాడు. ఈ మేరకు లీగల్ నోటీసును పంపిస్తూ ఈ వ్యాఖ్యలను కూడా జత చేసింది. ఇలాంటి అసభ్యపదజాలంతో దూషించాడని పేర్కొంది.

బహిరంగ క్షమాపణ..
అసలు రాకేష్ మాస్టర్ ఎవరో తనకు తెలియదని పేర్కొంది. అతని వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని ఆమె తెలిపింది. ఆయన తన కామెంట్స్‌ని వెనక్కు తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో లీగల్‌గా ముందుకు వెళ్ళాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఫేమస్ అవ్వడానికే..
కేవలం ఫేమస్ అవ్వడానికి ఇలా యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టి, ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నాడని పేర్కొంది. ఎస్‌ఆర్‌కే ఎంటర్టైన్మెంట్స్, ఎతిక్ టీవీ ఛానెల్‌ను ప్రస్తావిస్తూ.. అందులో తన వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశాడని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











