కారణం లేకుండానే ద్వేషించా.. పవన్ కళ్యాణ్‌పై మాధవీలత ఎమోషనల్

నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత గురించి పరిచయం అక్కర్లేదు. నిత్యం వివాదాలతో సావాసం చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవీలతపై ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. మాధవీలతా బీజేపీ అయినా కూడా పవన్ కళ్యాణ్ మీద ఇష్టమని చెబుతూ ఉంటుంది. ఆయనంటే ప్రేమ, ప్రాణం అంటూ బహిరంగంగానే చెప్పుకొస్తుంది. అలాంటి మాధవీలత తాజాగా ఆమె ప్రేమనంతా బయటపెట్టేసింది.

బికినీలో దుమ్మురేపిన పూజా భలేకర్.. అంగాంగ ప్రదర్శనతో మరీ హాట్‌గా

ఆ మధ్య అలా..

ఆ మధ్య అలా..

గతేడాది పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెలెబ్రిటీలందరూ విషెస్ అందించారు. అలా తనకు విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికీ పవన్ కళ్యాణ్ పేరు పేరునా పలకరిస్తూ ట్వీట్లతో రిప్లై ఇచ్చాడు. ఆ విషయంలో మాధవీలత హర్ట్ అయింది. మిమ్మల్ని పట్టించుకోకుండా.. కేవలం ఇలా బర్త్ డేలకు విషెస్ చెప్పే వారికి ఎందుకు రిప్లై ఇస్తున్నారంటూ మాధవీలత ప్రశ్నించింది.

ట్రోలింగ్‌పై ఫైర్..

ట్రోలింగ్‌పై ఫైర్..

మాధవీలత తనపై జరిగే ట్రోలింగ్‌ను గట్టిగానే తిప్పి కొడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరైనా తనను ముడిపెడుతూ కామెంట్లు చేస్తే ఘాటుగా కౌంటర్లు ఇస్తుంటుంది. వ్యక్తిగా ఆయన ఇష్టం.. పార్టీగా బీజేపీ అంటే ఇష్టమంటూ మాధవీలత క్లారిటీ ఇస్తుంటుంది.

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

మాధవీలత తాజాగా సుమ క్యాష్ షోలో గెస్ట్‌గా వచ్చింది. ఆ సమయంలో మాధవీలత తన మనసులో దాచుకున్న విషయాన్ని బయటపెట్టేసింది. చిన్న తనంలో మాధవీలత రాసిన ప్రేమ లేఖల్లోంచి ఒకదాన్ని చదివి వినిపించేలా చేసింది. ఖుషి సినిమా సమయంలో మాధవీలత ప్రేమ లేఖలు రాసిందట.

ద్వేషించాను..

ద్వేషించాను..

నీపై ఆశపడటం తప్పే.. అందుకోవాలనుకోవడం తప్పే అంటూ పవన్ కళ్యాణ్‌పై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రేమలో ఓ లైన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. కారణం లేకుండానే ద్వేషించా.. నా ఫ్రెండ్‌తో పోట్లాడా.. తరువాత నువ్వేంటో తెలిశాక ఇష్టం పెరిగిందంటూ మాధవీలత చెప్పుకొచ్చింది.

పదహారు ఉత్తరాలు..

పదహారు ఉత్తరాలు..

ఇదంతా మాధవీలత స్కూల్ ఏజ్‌లో జరిగింది. రెండేళ్లలో దాదాపు పదహారు ఉత్తరాలు రాసుకుందట. అందులో ఇది ఒకటి అని చెప్పడంతో సుమ కౌంటర్ వేసింది. అంటే మనకు ఇంకా పదిహేను ఎపిసోడ్‌లు కంటిన్యూ చేయొచ్చు అంటూ సెటైర్ వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X