రాడ్లు దింపుతారట.. ఎవరేం పీకుతారో చూస్తా.. మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్
నటీ, బీజేపీ నాయకురాలు మాధవీలతా తనపై జరుగుతున్న సోషల్ మీడియా దాడిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మాధవీలత చేస్తోన్న హల్చల్ అందరికీ తెలిసిందే. ప్రభుత్వ వ్యవహారాలు, చర్యలు, సమాజంలో జరిగే తప్పులను వేలెత్తి చూపుతుంటుంది మాధవీలత. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై మాధవీలత పెట్టిన పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. మాధవీలత పోస్ట్‌లపై నెటిజన్ల ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. ఇక ఆ ట్రోలింగ్ భరించలేకపోయిన మాధవీలత పోలీసులను ఆశ్రయించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
నటి మాధవీలత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం చేపట్టే చర్యలు, చేసే పనులు, చేయాల్సిన పనులను వేలెత్తి చూపుతుంది. సమాజంలోని అసమానతలు, స్త్రీలపై జరిగే అన్యాయాలపై పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది.

ఎక్కువగా ట్రోలింగ్..
మామూలుగానే మాధవీలతపై ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యే సెలెబ్రిటీల్లో మాధవీలత కూడా ఉంటుంది. ఈ మధ్య ట్రోలింగ్ మరీ ఎక్కువ అవ్వడంతో ఫేస్ బుక్ నుంచి తప్పుకుంటున్నట్టు పోస్ట్ కూడా చేసింది. అయితే తాజాగా తనపై ట్రోలింగ్ శ్రుతిమించడంతో పోలీస్ కేసు పెట్టేసింది.

దారుణంగా కామెంట్లు..
నేను ప్రశ్నిస్తున్నాను అని స్వేచ్చగా మాట్లాడుతున్నానని నా మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. కొన్ని గ్రూపులు నా మీద కక్షగట్టి అలా ప్రచారం చేయిస్తున్నాయి. మరీ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. వాటిని చూసి మా తల్లిదండ్రులకు ఏమైనా అయితే.. లేదా నేను సూసైడ్ చేసుకుంటే ఎవరిది బాధ్యత అంటూ మాధవీలత మీడియా ఎదుట వాపోయింది.

రాడ్లు దింపుతారట..
రాడ్లు దింపుతారట.. నేను కనిపిస్తే కొడతారట..చంపుతామని బెదిరిస్తున్నారు.. అయితే ఎవరేం పీకుతారో చూస్తా.. దేవాలయాల దాడిపై ఓ హిందువులా ప్రశ్నిస్తే చంపేస్తారా.. నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటాను.. నా మీద ట్రోలింగ్ చేసి పిచ్చి పిచ్చి పోస్ట్‌లు పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను అంటూ మాధవీలత వార్నింగ్ ఇచ్చింది.

ఒక్కొక్కడికి..
వాట్సప్ గ్రూపులు, సోషల్ మీడియాలో పేజీలు క్రియేట్ చేసి తన మీద దుష్ప్రచారం చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని, వాళ్లందరినీ పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం ఉందని, వాళ్లందరినీ పట్టుకొచ్చి ఒక్కొక్కడికి వాతలు పెట్టేలా కొట్టాలని లేదా మళ్లీ ఇక్కడే మౌన దీక్ష చేపడతానని మాధవీలత చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











