రాత్రికి ఫ్రీనా అని అడిగాడు, బాడీ గురించి వర్ణిస్తా.. పవన్ కోసం ఆరు పేజీల ప్రేమ లేఖ, మాధవీలత సంచలనం!

Recommended Video

రాత్రికి ఫ్రీనా అని అడిగాడు...అయిన ఓకే అనుకున్న

సినీ అవకాశాల మాటు జరుగుతున్న చీకటి కోణాల్ని ప్రస్తుతం హీరోయిన్లు ఒక్కొక్కరుగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. మీ టూ అంటూ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఉద్యమమే జరుగుతోంది. చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్లకు ఎదురవుతున్న అనుమానాలు, కాస్టింగ్ కౌచ్ పేరుతో జరుగుతున్న చీకటి నిజాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న హీరోయిన్ మాధవి లత సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురుగా చేదు అనుభవాల గురించి సంచలన విషయాలు బయట పెట్టారు.

ప్రైవేట్ గా బయటకు వెళదాం

ప్రైవేట్ గా బయటకు వెళదాం

నచ్చావులే సినిమాకు ముందు తాను సినీ అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ కో ఆర్డినేటర్ ఫోన్ చేసి ఓ సినిమా అవకాశం ఉందని చెప్పాడని మాధవి లత తెలిపింది. దానికంటే ముందు మనం ప్రైవేట్ గా బయటకు వెళదాం అని అడిగాడు.

నీ బాడీ గురించి వర్ణిస్తా

నీ బాడీ గురించి వర్ణిస్తా

మనం ప్రైవేట్ గా గడిపితే మన మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఆ తరువాత నీ ఫిగర్ గురుంచి ప్రొడ్యూసర్ కు వర్ణిస్తా. తద్వారా సినిమాలో అవకాశం వస్తుందని అతడి నాతో చెప్పినట్లు మాధవి లత తెలిపింది. అతడి ఉద్దేశం తనకు అర్థం అయిందని ఆ తరువాత ఫోన్ చేస్తే తాను లిఫ్ట్ చేయలేదని మాధవి లత తెలిపింది.

రాత్రికి ఫ్రీనా అని అడిగాడు

రాత్రికి ఫ్రీనా అని అడిగాడు

మరో సందర్భంగా అనుకోకుండా ఓ రోజు నాకు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే రాత్రికి ఫ్రీనా అని అడిగాడు. వెంటనే చెప్పు తీసుకుని కొడతా అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చా. అంత సీన్ లేదులే.. మీలాంటి వారి గురించి మాకు తెలుసు అంటూ అసభ్యంగా మాట్లాడాడు. నీ నంబర్ తీసుకుని వెంటనే పోలీస్ కంప్లైన్ట్ చేస్తా అని చెప్పగానే ఫోన్ పెట్టేసాడని మాధవి తెలిపింది.

మగ మనసు చలిస్తుంది

మగ మనసు చలిస్తుంది

సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందమైన అమ్మాయిని చూడగానే మగ మనసు చలిస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. ఎవరు ఎన్ని విధాలు ప్రలోభ పెట్టి లోబరుచుకోవాలని ప్రయత్నించినా లొంగలేదని అన్నారు. అలా అని ఎవరితోనూ గొడవకు దిగలేదని మాదవి అన్నారు.

తప్పదు కదా అని నిర్మాత అన్నాడు

తప్పదు కదా అని నిర్మాత అన్నాడు

తనకు ఓ నిర్మాత ఫోన్ చేసి పరోక్షంగా కమిట్ మెంట్ ఇస్తావా అని అడిగాడు. కుదరదు సర్ అని చెప్పాను. సినిమా అవకాశం అడిగినప్పుడు ఇలాంటివి తప్పదు కదా అని అన్నాడు. తాను లేదు సర్ అని ఫోన్ పెట్టేశానని మాధవి అన్నారు.

అందుకే పేరు చెప్పడం లేదు

అందుకే పేరు చెప్పడం లేదు

ఆ నిర్మాత పేరు చెప్పకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని మాధవి అన్నారు. ఇండస్ట్రీలో ఎక్కువశాతం ఇలాంటి వారే ఉన్నారు. కానీ అతడి పేరు మాత్రమే చెప్పడం వలన మిగిలిన వారు అతడిని నిందిస్తారు. నిర్మాతగా అతడు చాలా మందిని పోషిస్తున్నాడు. ఈ అంశాలని ఆలోచించే అతడి పేరు బయట పెట్టడం లేదని మాధవి అన్నారు.

అతడే మళ్ళీ ఫోన్ చేశాడు

అతడే మళ్ళీ ఫోన్ చేశాడు

కొన్నేళ్ల తరువాత ఆ నిర్మాతే తనకు ఫోన్ చేసి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేస్తావా అని మర్యాదగా అడిగారు. ఆ సందర్భంగా ఆయన తప్పుగా మాట్లాడినా నేను తిట్టలేదు. ఆ గౌరవంతోనే తనకు తిరిగి ఫోన్ చేసి ఉంటాడని ఆమె తెలిపింది. కానీ తనకు ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం ఇష్టం లేదని చెప్పానని మాధవి తెలిపింది.

శరీరమే లంచం

శరీరమే లంచం

ఇండస్ట్రీలో హీరోయిన్లు శరీరాల్ని సమర్పించుకునే పద్దతి ఆగదని మాధవి అన్నారు. కొంతమంది విధిలేని పరిస్థితుల్లో ఆ పని చేస్తుంటే, మరికొంత మంది అమ్మాయిలు సినిమా అవకాశాల కోసం వారి శరీరాల్ని లంచంగా సమర్పించుకుంటున్నారని మాదవి అన్నారు.

పవన్ కోసం ఆరు పేజీల ప్రేమ లేఖ

పవన్ కోసం ఆరు పేజీల ప్రేమ లేఖ

తనకు చిన్న తనం నుంచే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఏర్పడిందని మాధవి అన్నారు. నటుడిగా కంటే ఆయన వ్యక్తిగా ఎక్కువమంది అభిమానులని సంపాదించుకున్నారని మాధవి తెలిపింది. ప్రజలకు సాయపడే గుణం చూసి నేను కూడా పవన్ ని ఇష్టపడ్డానని మాధవి తెలిపింది. 15 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ కిశోరం ఆరు పేజీల ప్రేమ లేఖ రాసుకున్నానని మాధవి తెలిపింది. ఇప్పటికి ఆ లేఖ తనవద్దే ఉందని మాధవి వెల్లడించింది.

ఆ ఛాన్స్ మిస్సయ్యా

ఆ ఛాన్స్ మిస్సయ్యా

అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రంలో ఓ సాంగ్ లో నటించే ఛాన్స్ మిస్సయ్యా అని మాధవి తెలిపింది. డేట్స్ కుదరకపోవడం వలనే ఆ అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X