మహేష్ బాబు ముందే డైరెక్టర్ బూతులు తిట్టాడు... ఇండస్ట్రీలో అంతే: మాధవి లత

By Bojja Kumar

Recommended Video

Madhavi Latha Sensational Comments On Mahesh Babu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, నిర్మాతలు మహిళలకు సరైన రెస్పెక్ట్ ఇవ్వరని, హీరోలకు ఇచ్చినంత గౌరవం హీరోయిన్ల పట్ల చూపించరనే విమర్శ చాలా కాలం నుండి వినిపిస్తోంది. తెలుగులో కొన్ని పెద్ద సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే కూడా.... ఇక్కడ ఎదురైన అనుభవాలతో తెలుగు సినిమాలు చేయడమే మానేసింది. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె తెలుగు ఇండస్ట్రీపై విమర్శలు చేశారు. అయితే రాధిక ఆప్టే చెప్పింది అక్షరాలా నిజమే అని అంటోంది తెలుగు బ్యూటీ మాధవి లత. తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆమె తెలిపారు.

హీరోయిన్లను బూతులు తిట్టినా పట్టించుకోరు

హీరోయిన్లను బూతులు తిట్టినా పట్టించుకోరు

తెలుగు హీరోలు సెట్లో ఏం జరిగినా పట్టించుకోరు. అతిథి సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను మహేష్ బాబు ముందే బూతులు తిట్టాడు. అక్కడ నాకు ఎవరి నుండి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయాను అని మాధవి లత తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

మన హీరోల గురించి అందుకే అలా చెప్పాను

మన హీరోల గురించి అందుకే అలా చెప్పాను

మహేష్ బాబు లాంటి పెద్ద హీరో ముందు ఈ సంఘటన జరిగినపుడు డైరెక్టర్ కు చెప్పగలిగే స్థాయి ఆయనది. ఆడ పిల్లతో అలా మాట్లాడకూడదు కదా అని డైరెక్టర్‌కు ఒక మాట చెప్పిఉండొచ్చు. కానీ ఆయన చెప్పలేదు. అందుకే నేను మన హీరోలు రియాక్ట్ అవ్వరు, కేవలం స్క్రీన్ మీద రియాక్ట్ అవుతారని గత ఇంటర్వ్యూలో చెప్పాను... అని మాధవిలత గుర్తు చేసుకున్నారు.

నా అసలు పాయింట్ అది కాదు

నా అసలు పాయింట్ అది కాదు

గతంలో ఓ ఇంటర్వ్యూలో ‘‘సమస్యలో ఉన్నపుడు సినిమా ఇండస్ట్రీలోని మన హీరోలు ఎందుకు రెస్పాండ్ అవ్వరు?'' అన్న ప్రశ్నకు నేను... ‘‘జనరల్ గా రెస్పాండ్ అవ్వరు. మహేష్ బాబు వెల్ మ్యానర్, నైస్ జంటిల్మెన్, సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారు అని మూడు పాయింట్లు చెప్పాను. డైరెక్టర్ తిట్టినపుడు మహేష్ బాబు రియాక్ట్ అవ్వలేదనే నాలుగో పాయింటుకు జనాలకు బాగా మండింది. కానీ నా అసలు పాయింట్ అది కాదు. మహేష్ బాబుతో నాకు ఎలాంటి శతృత్వం లేదు, అతడికి నేను వ్యతిరేకం కాదు. షూట్లో ఉన్నపుడు ఆయన ప్రవర్తన చాలా బావుంటుంది. కానీ హీరోలు ఎందుకు అమ్మాయిల సమస్యపై గొంతు ఎత్తరు? అన్న ప్రశ్న ఎదురైనపుడు అతిథి సినిమా షూటింగ్ ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చి చెప్పానంతే..... అని మాధవిలత తెలిపారు.

 అలాంటివి ఎప్పుడూ ఆశించను

అలాంటివి ఎప్పుడూ ఆశించను


అతిథి డైరెక్టర్ నాపై ఓ బూతు పదం వాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. అపుడు నా ఎదురుగా మహేష్ బాబు ఉన్నాడా? పవన్ కళ్యాణ్ ఉన్నాడా? ఆయనెందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది నా ఎమోషన్ కాదు. అలాంటివి నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయను. ఒకరు నన్ను తిట్టినపుడు ఆయనకు నేను ఏం కౌంటర్ ఇస్తాను అనేదే నేను ఆలోచించుకుంటానే తప్ప ఎదుటివారు నాకు ఏమీ చేయలేదని ఆశించను. మహేష్ బాబు లాంటి పెద్ద హీరో ముందు ఈ సంఘటన జరిగినపుడు డైరెక్టర్‌కు చెప్పగలిగే స్థాయి ఆయనది. ఎందుకు అలా మాట్లాడకూడదు కదా అని ఒక మాట చెప్పిఉండొచ్చు. కానీ ఆయన చెప్పలేదు. అందుకే నేను మన హీరోలు రియాక్ట్ అవ్వరు, కేవలం స్క్రీన్ మీద రియాక్ట్ అవుతారని చెప్పాను... అని మాధవి లత అన్నారు.

ఆ పెద్ద హీరో అంటే అందరికీ భయం

ఆ పెద్ద హీరో అంటే అందరికీ భయం


గతంలో రాధిక ఆప్టే తెలుగులో ఓ పెద్ద హీరో మీద కామెంట్స్ చేసింది. కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఆయన పెద్ద హీరో కాబట్టే అందరికీ భయం. చంపేస్తారేమో? కాల్చేస్తారేమో? కొట్టేస్తారేమో? అనే భయంతో ఇండస్ట్రీలో ఎవరూ నోరు విప్పలేదు. టాలీవుడ్ పెద్ద హీరోలకు రాచరికపు రాజ్యం లాంటిది. రాజు ఏం చేస్తే అది నడుస్తుంది. వాళ్ల దృష్టిలో ఇతరులంతా బానిసలు... అని మాధవి లత తెలిపారు.

 మిగిలినవన్నీ చంపేసుకుంటారు

మిగిలినవన్నీ చంపేసుకుంటారు

ఇక్కడ ఎలాంటి మాటలు అన్నా భరించేవాళ్లు కొంత మంది అయితే, ఇదే జీవితం, ఇక్కడ ఇలా ఉంటేనే వర్కౌట్ అవుతుందని అలవాటు చేసుకుని దాన్నే హ్యాపీగా లీడ్ చేసే వారు కూడా ఉన్నారు. ఎవరి ముఖాల్లో సంతోషాలు ఉండవు, ఎవరి ముఖంలో స్వచ్ఛత కూడా ఉండదు. అన్ని ఆర్టిఫిషియల్. మాకు డబ్బు, స్టేటస్, పేరు, పలుకుబడి ఉంది, జనాల్లోకి వెళితే గుర్తు పడతారు, స్టార్ హీరోయిన్ అనే రేసులో ఉన్నపుడు ఆటోమేటిక్ గా మిగిలినవన్నీ చంపేసుకుంటారు.... అని మాధవి లత తెలిపారు.

ఎవడు ఎంత ఎదవ అనేది అమ్మాయిలు మాట్లాడుకుంటారు

ఎవడు ఎంత ఎదవ అనేది అమ్మాయిలు మాట్లాడుకుంటారు


ఇండస్ట్రీలోని అమ్మాయిలు, హీరోయిన్లు స్వచ్చంగా వాళ్ల అమ్మతో నవ్వుతారే తప్ప వేరే ఎవరితో నవ్వరు. ఎవరి పర్సనల్ లైఫులు హ్యాపీగా ఉండవు. ఎవరూ మనస్ఫూర్తిగా నవ్వలేరు. ఎవరూ మనస్పూర్తిగా నిజాలు బయటకు చెప్పుకోలేరు. క్లోజ్ ఫ్రెండ్స్ తో కూడా చెప్పుకోలేరేమో? అయితే ఎవడు ఎంత ఎదవ అనేది అమ్మాయిలు కూర్చుని బాగా మాట్లాడుకుంటారు. ఒక ఆడ పిల్లగా ఈ విషయం నాకు తెలుసు... అని మాధవి లత అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X