twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనకు సిగ్గులేదు, ఏంటో ఈ ఖర్మ? : తెలంగాణా ప్రభుత్వవిధానాలపై మాధవీలత ఫైర్

    మాధవీలత (నచ్చావులే ఫేమ్) కూడా ఇవాంకా రాక మీద ఒక సెటైర్ వేసింది. అయితే ఇది మన ప్రభుత్వాన్నీ, జనం లోఉన్న నిర్లక్ష్యాన్నీ ఉద్దేశించి చేసిందే...

    |

    Recommended Video

    మనకు సిగ్గులేదు, ఏంటో ఈ ఖర్మ? మాధవీలత ఫైర్

    ఇవాంకా ట్రంప్ గత వారంరోజులుగా హైదరాబాద్ మొత్తం మారుమోగుతున్న పేరు. అసలు ఇవాంకా వచ్చిన సందర్భానికీ, టాలీవుడ్‌కీ ఏ సంబందం లేకపోయినా ఆమె రాకవల్ల ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా అందరూ ఏదో ఒక రకమైన స్పందన తెలియజేస్తున్నారు. కొన్ని అభినందనలూ, మరికొన్ని నిరసనలూ కలిపి మొత్తానికి ఇవాంకా రాక వల్ల చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు... ఇప్పుడు మాధవీలత (నచ్చావులే ఫేమ్) కూడా ఇవాంకా రాక మీద ఒక సెటైర్ వేసింది. అయితే ఇది మన ప్రభుత్వాన్నీ, జనం లోఉన్న నిర్లక్ష్యాన్నీ ఉద్దేశించి చేసిందే...

     వారికి మర్యాదలు చేయడం తెలియకా?

    వారికి మర్యాదలు చేయడం తెలియకా?

    హైదరాబాద్‌ కు ఇవాంకా ట్రంప్ వస్తుండడంతో ఇంత హడావిడి. ఆమె వెళ్లే ప్రాంతాల్లో క్లీనింగ్, పెయింటింగ్ చేశారు. బాగుంది. మరి అమెరికాకు మన అధినేతలు వెళ్తే వాళ్లేమీ కొత్తగా చేయరు. ఎందుకు? అంటే వారికి మర్యాదలు చేయడం తెలియకా? లేక రాకా? కాకపోతే అలా హడావుడి చేయాల్సిన అవసరం వారికి లేదా?

     ఒకే తరహా రోడ్లు ఉన్నాయా?

    ఒకే తరహా రోడ్లు ఉన్నాయా?

    అదీకాకపోతే అక్కడ ప్రజలందరికీ ఒకే తరహా రోడ్లు ఉన్నాయా? అంటే దీని అర్ధం మనం ఇంకా చాలా డెవలప్‌ మెంట్ అవ్వాల్సి ఉందని అర్థమైంది కదా! ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అతిథి కోసం కాకుండా ప్రజల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అవెప్పుడూ అలాగే ఉండాలి' అంటూ ఆకాంక్షించింది.

    పోలీసుల ఓవర్ యాక్షన్

    పోలీసుల ఓవర్ యాక్షన్

    అలా చేస్తే ఇలా ఎవరైనా వచ్చినప్పుడు హడావుడి, హంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అతిథుల వల్ల ఏర్పడే ట్రాఫిక్ సమస్యలకు తోడు పోలీసుల ఓవర్ యాక్షన్ ఒకటి అని మండిపడింది. ఏమంటే సెక్యూరిటీ రీజన్స్ అంటారని చిరాకు పడింది. మన దేశంలో వీఐపీల ప్రాణాలకు తప్ప మామూలు మనుషుల ప్రాణాలకు విలువ లేదా? అని ఆమె ప్రశ్నించింది.

    అయినా మనకు సిగ్గురాదని

    అయినా మనకు సిగ్గురాదని

    వీఐపీలు వచ్చి మనకు ఏం ప్రాజెక్టులు తెస్తారో? తీసుకురారో? తెలీదు కానీ సాధారణ ప్రజానీకం మాత్రం కష్టాల పాలు కావాల్సిందేనని పేర్కొంది. అయినా మనకు సిగ్గురాదని ఆవేదన వ్యక్తం చేసింది. అదే నాయకులకు ఓట్లు వేస్తాం, ఎందుకంటే, ఎవరో ఒకరు వస్తున్నారనైనా రోడ్లు వేశారు కదా అన్న ఆనందంతో పొంగిపోతామని తెలిపింది.

    నచ్చినా నచ్చుకున్నా

    ఏంటో ఈ ఖర్మ? అంటూ నిట్టూర్చింది. తన పోస్టు ఎవరికి నచ్చినా నచ్చుకున్నా... ప్రభుత్వ విధానాలు నచ్చలేదని సూటిగా చెప్పేసింది. ఇంతకీ ఆమెకి వచ్చిన ప్రతిస్పందన ఏమిటనే కదా మీ అనుమానం... ఇదిగో ఈ లింక్ లో చూడండి.

    English summary
    Nacchavu le Madhavi Latha fires on our political system, she posted a satire on her Facebook wall about Ivanka Trump visit To India
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X