పనికి మాలిన సినిమా.. వర్మను దారుణంగా ఏకిపారేసిన మాధవీలత
మాధవీలత స్వతహాగానే పవన్ కళ్యాణ్ అభిమాని. నాడు మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలోనూ అంత వరకు బాగానే యాక్టివ్‌గా ఉన్న మాధవీలత.. ఒక్కసారి డ్రాప్ అయింది. పవన్ కళ్యాణ్‌పై శ్రీ రెడ్డి అనుచితంగా నోరు పారేసుకోవడంతో మాధవీలత పూర్తిగా దూరంగా ఉండిపోయింది. అప్పటి నుంచి శ్రీ రెడ్డి, మాధవీలత మధ్య దూరం ఇంకా ఎక్కువైంది. అలా పవన్ కళ్యాణ్‌ను తిడితేనే తట్టుకోలేని మాధవీలత పవర్ స్టార్ మూవీ, దాన్ని తీసిని ఆర్జీవీపై ఫైర్ కాకుండా ఉంటుందా?.

పవర్ స్టార్ అంటూ రచ్చ..
ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా ఎంతలా ఫోకస్ పెట్టాడో అందరికీ తెలిసిందే. రోజుకు కొన్ని పదుల పోస్టర్లు విడుదల చేస్తూ పవర్ స్టార్‌ను ప్రమోట్ చేసుకున్నాడు. గడ్డి తింటావా అంటూ రిలీజ్ చేసిన ఓ పాట, ట్రైలర్ ఎంతగా రచ్చ చేశాయో అందరికీ తెలిసిందే. ఇక సినిమా రిలీజయ్యాక ఫలితం తేడా కొట్టిన సంగతి కూడా తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టివ్..
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది మాధవీలత. పార్టీ కార్యకలాపాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ సినిమా, పవన్ కళ్యాణ్ గొప్పదనంపై మాధవీలత చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

వర్మ ఏంటి నీకీ కర్మ..
వర్మపై ఫైర్ అయిన మాధవీలత.. ‘ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు..? తొక్కలో సినిమా కథలు రాసుకోవడం ఎందుకు? ఒక స్టేటస్ ఒక లెవెల్ మెయింటేన్ చేసేవాళ్లు అలానే ఉండాలి కానీ కాదేదీ కవితకనర్హం అన్నట్టు మొన్న ఒక ఆడపిల్ల కథ మీద సినిమా అనుకున్నాడు.. ఇప్పుడు ఏం పాపం చేశాడని పీకే మీద పనికిమాలిన సినిమా??? వర్మ ఏంటి నీకీ కర్మ??
Recommended Video

ఏమీ పీకలేని..
ప్రజల మంచి కోరుకునే మంచి మనిషి.. నీకు పర్సనల్ పగ ఉంటే అతనితో తేల్చుకో.. చేతకాని కహాని ఎందుకు అయినా ఆయన్నీ ఏమీ పీకలేని వాళ్లు అయన పర్సనల్ క్యారెక్టర్ మీద పడి ఏడుస్తారు.. ఎప్పటికీ పీకే లవర్‌నే.. 'అంటూ ఓ రేంజ్‌లో విరుచుకపడింది.


Click it and Unblock the Notifications











