మహిళల పరువు పోయింది.. సమంత వ్యవహారం మీద మాధవీలత షాకింగ్ కామెంట్స్.. నేను కూడా కేసు పెడతా అంటూ !
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. అందులో మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ ముందు కాపీ వివాదంలో చిక్కుకోగా ఇప్పుడు కేసుల్లో కూడా చిక్కుకుంది. తాజాగా కేసుల అంశం మీద నటి మాధవీలత స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా లెవల్ లో
అల్లు అర్జున్, రష్మిక మంథన్నా హీరో హీరోయిన్లుగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్ ఇండియా లెవల్ లో డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సమంత ఐటెం సాంగ్
ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ మధ్య ఒక పాటను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. పుష్పలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉ అంటావా..ఊ ఊ అంటావా.అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

'హానీ.. హానీ' పాటలాగా
దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించగా ఈ పాటను చంద్రబోస్ రాయగా మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడారు. ఈ పాట నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుండగా ఈ పాట ఎక్కడో విన్నట్టుందే అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం సూర్య హీరోగా నటించిన 'వీడొక్కడే' సినిమాలోని 'హానీ.. హానీ' పాటలాగా ఉందని ట్రోల్స్ కూడా చేశారు. కానీ యూనిట్ తరపున అయితే ఎవరూ స్పందించలేదు.

ఏపీ పురుష సంఘం
దానికి తోడు ఈ సాంగ్‌లో వాడిన పదాలు పురుషుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని, సాంగ్‌లో సాహిత్యం మగవాళ్లందరూ కామంతో ఉంటారనే అర్థం వచ్చేలా ఉందని, వెంటనే ఆ పాటను సినిమా నుంచి తీసేయాలని అంటూ ఏపీ పురుష సంఘం ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించడం పెద్ద చర్చకే దారి తీసింది.
Recommended Video

నేను కూడా పెడతా కేసు
ఈ అంశం మీద నటి మాధవీలత స్పందించింది. ''వామ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా.. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98% సాంగ్స్ అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీస్ చేయాలి. ఇక నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. రారా సామి సాంగ్ మీద కేసు వేస్తా. ఏంటి ఒక అమ్మాయికి మగాడిని చూస్తే, అతను పోతుంటే అంత చులకనగా వెంటపడి వెళ్ళిపోద్దా?? అబ్బాయి నడిచిన చోట ల్యాండ్ ను టచ్ చేసి మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే.. నేను కూడా పెడతా కేసు. అంతే.. తగ్గేదేలే'' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది మాధవీలత.


Click it and Unblock the Notifications











