మాధవీలత సంచలన ఫేస్‌బుక్ పోస్ట్.. పవన్ కళ్యాణ్‌కు తెలిసిన నిప్పులాంటి నిజం, వెయిట్ అండ్ సీ!
Recommended Video

కాస్టింగ్ కౌచ్ విషయంలో నటి శ్రీరెడ్డి సంచలన విషయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. మాధవీలత కూడా ఈ విషయంలో తరచుగా గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హస్తం ఉన్న బడా సెలెబ్రిటీల పేర్లనే శ్రీరెడ్డి బట్టబయలు చేసింది. మాధవీలత కూడా తనకు ఎదురైన అనుభవాలని వెల్లడించింది. సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ వివిధ అంశాల గురించి మాట్లాడుతోంది.తాజగా మాధవీలత పేస్ బుక్ పేజీ లో సంచలన పోస్ట్ పెట్టింది. దీని గురించి పవన్ అభిమానుల్లో రకరకాలు చర్చలు జరుగుతున్నాయి.

శ్రీరెడ్డి పోరాటం
కాస్టింగ్ కౌచ్ దారుణాలని దైర్యంగా వెల్లడించడంతో శ్రీరెడ్డి టాలీవుడ్ లో నయా సెలేబ్రిటిగా వెల్లడించింది. ఆమె ప్రముఖుల పేర్లని సైతం బయట పెట్టడంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. దీనితో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కళ్యాణ్ స్పందన
ఇటీవల పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి పోరాటం గురించి స్పందించారు. అన్యాయం జరిగి ఉంటె నిరసన చేయాల్సిన మార్గం ఇది కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అన్యాయం జరిగి ఉంటె నేరుగా వెళ్లి పోలీస్ కేసునమోదు చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ స్పందపై శ్రీరెడ్డి మరియు ఇతర జూనియర్ ఆర్టిస్టులు మండిపడిన సంగతి తెలిసిందే.

మాధవీలత కూడా
టాలీవుడ్ లో వర్తమాన నటీమణులకు ఎదురవుతున్న అవమానాల గురించి హీరోయిన్ మాధవీలత కూడా చాలా కాలంగా గళం విప్పుతోంది. మాధవీలత ఇటీవల తాను పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి అభిమానిని అని తెలిపిన సంగతి తెలిసిందే.

ప్రముఖ పేర్లు బయటకు
కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల విషయంలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లే బయటకు వస్తున్నాయి. శ్రీరెడ్డి స్వయంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ పేరు వెల్లడించిన సంగతి తెలిసిందే. అభిరామ్ తో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోలని కూడా శ్రీరెడ్డి బయట పెట్టింది.

మాధవిలతకు కూడా అదే పరిస్థితి
కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన ఘటనలు తనకు కూడా ఎదురయ్యాయని మాధవీలత వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తాను ఎవరికీ తలొగ్గలేదు అని మాధవీలత తెలిపింది.

సంచలన పోస్ట్
తాజాగా మాధవీలత పేస్ బుక్ లో సంచలన పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ ఉండడం విశేషం.

పవన్ కళ్యాణ్‌కు నిజం తెలుసు
పవన్ కళ్యాణ్ కు నిజం తెలుసు అని మాధవీలత అన్నారు. అందుకే ఆయన ఇన్నిరోజులు స్పందించకుండా ఉన్నారని అన్నారు. ఇటీవల కూడా తప్పని పరిస్థితుల్లో ఆయన స్పందించారని మాధవీలత అన్నారు.
త్వరలోనే నిజం బయటకు
త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని మాధవీలత అన్నారు. తాను ఎందుకు పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తున్నానో తెలుస్తుందని మాధవీలత తెలిపింది.

అనుకున్నంత తెలివి తక్కువ వారు కాదు
ఇదే పోస్ట్ లో మాధవీలత అభిమానులని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేసింది. ఏంటి ఫాన్స్..మీకే చెబుతున్నా పవన్ కళ్యాణ్ మీరు అనుకున్నంత తెలివి తక్కువ వారు కాదు అని మాధవి అన్నారు. ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన నిజం, పవన్ కళ్యాణ్ కు తెలిసిన నిప్పులాంటి జనం త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. ఆ నిజాల కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications











