For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సలార్’లో విలన్ ఆ స్టార్ హీరో కాదు: ప్రభాస్‌తో తలపడనున్న భయంకరమైన నటుడు.. పోస్ట్ చేసి మరీ!

  |

  కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. గతంలో చిన్న చిత్రాల్లోనే నటించిన అతడు.. ఈ మధ్య ఏకంగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ యూనివర్శల్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. 'బాహుబలి', 'సాహో' వంటి భారీ చిత్రాల తర్వాత అతడు 'రాధే శ్యామ్'లో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే 'సలార్' అనే సినిమానూ ప్రారంభించాడు. ఇందులో విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  Prabhas in Godavarikhani for shooting of ‘Salaar’
  త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు

  త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు

  జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు. దీని టీజర్ ఫిబ్రవరి 14న వస్తుంది.

  మూడు ప్రకటన.. చివరిది ముందుగా స్టార్ట్

  మూడు ప్రకటన.. చివరిది ముందుగా స్టార్ట్

  ‘రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీనితో పాటు ‘ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఓం రౌత్ రూపొందించనున్నాడు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ ప్రకటించాడు. అన్నింటికంటే ముందే దీన్ని మొదలెట్టాడు.

   షూటింగ్ మొదలైంది.. యాక్షన్ సీక్వెన్స్‌తో

  షూటింగ్ మొదలైంది.. యాక్షన్ సీక్వెన్స్‌తో

  ‘కేజీఎఫ్' మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘సలార్'. హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక, ఇటీవలే సింగరేణి గనుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రకరిస్తున్నారు.

  చిత్ర యూనిట్‌కు యాక్సిడెంట్.. అంతా సేఫ్

  చిత్ర యూనిట్‌కు యాక్సిడెంట్.. అంతా సేఫ్

  మూడు రోజుల క్రితం ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్' షూటింగ్ స్పాట్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి ‘సలార్' మూవీ యూనిట్‌కు కూడా ప్రమాదం జరిగింది. షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తోన్న సమయంలో గోదావరిఖనిలో చిత్ర యూనిట్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తూ ఆ వాహనంలోని వారంతా సేఫ్‌గా ఉన్నారు.

  ‘సలార్'లో విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరోనే

  ‘సలార్'లో విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరోనే

  ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్'లో హీరో క్యారెక్టర్‌ను ఎంతగానో ఎలివేట్ చేశాడు. అదే సమయంలో విలన్‌ను కూడా హైలైట్ చేసి చూపించాడు. ఇక, ఇప్పుడు ‘సలార్'లో ప్రభాస్‌ను ఢీకొట్టే ప్రతినాయకుడి విషయంలోనూ అదే పంథాను ఫాలో అవబోతున్నాడని అంటున్నారు. ఇందుకోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

  భయంకరమైన నటుడు రెడీ.. పోస్టు కూడా

  భయంకరమైన నటుడు రెడీ.. పోస్టు కూడా

  మధు గురుస్వామి అనే నటుడు తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘హలో ఫ్రెండ్స్.. నేను ‘సలార్' మూవీలో చేయబోతున్నా. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ప్రశాంత్ నీల్ సార్‌కు, విజయ్ కిరంగదుర్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ ప్రభాస్‌ ఫొటోతో పోస్ట్ చేశాడు. దీంతో ఇందులో అతడే విలన్ అని వార్తలు వస్తున్నాయి.

  అంతకు ముందే ఓ తెలుగు సినిమాలోనూ

  అంతకు ముందే ఓ తెలుగు సినిమాలోనూ

  కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ‘వజ్రకాయ' అనే సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు మధు గురుస్వామి. ఆ తర్వాత ‘జాను', ‘భజరంగీ', ‘చింగారీ', ‘మఫ్టీ' వంటి హిట్ చిత్రాల్లో భయంకరమైన ప్రతినాయకుడిగా కనిపించాడు. ఇక, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘సాక్ష్యం' ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. వీటితో పాటు దక్షిణాదిలో మరికొన్ని చిత్రాల్లో నటించాడు.

  English summary
  director Prashanth Neel gave everyone a pleasant surprise by releasing the first look poster of his next pan-India project Salaar, starring Prabhas in the lead role. Ever since the announcement poster came out, fans can't keep calm to know about the lead actress in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X