ఎన్టీఆర్ తోపు.. బిగ్ బాస్ 2లో లేక పోవడం బాధాకరం: మధుప్రియ
బిగ్ బాస్ రెండో సీజన్ నడుస్తున్న తీరుపై మొదటి సీజన్ కంటెస్టెంట్, ప్రముఖ సింగర్ మధు ప్రియ స్పందించారు. ఎన్టీఆర్, నాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'బిగ్ బస్ హోస్టింగులో ఎన్టీఆర్ అన్న తోపు. మేము ఆయన్ను స్వయంగా చూశాము. నాని గురించి పెద్దగా తెలియదు. నాని తన పరిధిలో తాను అద్భుతంగా చేస్తున్నాడు అన్నారు.
బిగ్ బాస్ మొదలైన మూడు రోజులే అయింది కాబట్టి అప్పుడే ఎవరినీ పాయింట్ ఔట్ చేయలేము. అందులో నాని ఒకే రోజు కనిపించారు. అప్పుడే ఆయన బాగా చేస్తున్నారా? లేదా? అనేది జడ్జ్ చేయలేం. తారక్ అన్న అద్భుతంగా చేశాడు అనేది ఎవరూ కాదనలేని విషయం అని మధు ప్రియ వ్యాఖ్యానించారు.

ఇప్పుడే చెప్పలేం
ఇప్పుడున్న కంటెస్టెంట్స్ బాగానే ఉన్నారనేది నా ఫీలింగ్. వాళ్లు ఎంత ఎంటర్టెన్మెంట్స్ అందిస్తారు అనేది మున్ముందు తెలుస్తుంది. మొదటి సీజన్లో ఉన్నవారు రాకింగ్ ఎంటర్టెన్మెంట్ అందించారనేది అందరికీ తెలిసిందే. ఆట, పాట, మాటల పరంగా ఆకట్టుకన్నారు, రెండో సీజన్ కంటెస్టెంట్ల గురించి కొన్ని రోజులు గడిస్తేకానీ చెప్పలేమని మధు ప్రియ అన్నారు.

ఇప్పటికైతే మసాలా కనిపించలేదు
ఈ సారి బిగ్ బాస్ 2లో ఇంకాస్త గరం మసాలా ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకైతే అలాంటి మసాలా ఏమీ కనిపించలేదు. ఇప్పుడే షో మొదలైంది కాబట్టి అప్పుడే జడ్జ్ చేయలేం. ఇకపై ఉండబోతోంది ఏమో చూడాలి అని వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ అన్న ఇపుడు లేక పోవడం బాధాకరం
బిగ్ బాస్ మొటి సీజన్‌కు, రెండో సీజన్ కు చాలా తేడాలు ఉన్నాయి. అప్పుడున్న ఎన్టీఆర్ అన్నతో పాటు కంటెస్టెంట్స్ అందరూ మారిపోయారు. రెండో సీజన్లో ఇంటితో పాటు అంతా కొత్తగా రెడీ అయింది. ఎన్టీఆర్ అన్న ఇపుడు లేక పోవడం బాధాకరం. బిగ్ బాస్ 2 లో ఎన్టీఆర్ అన్నను మిస్సవుతున్నాం. ఆయన ఈసారి చేయక పోవడానికి కారణం ఏమిటో మనకు తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అని మధు ప్రియ తెలిపారు.

నాని హోస్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి
ఎన్టీఆర్ అన్న చాలా నేచురల్ గా, మన ఇంట్లో జోవియల్ గా ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడేవారు. నేను అన్నయ్య అనడం, ఆయన చెల్లమ్మా అంటూ పిలకరించడం సంతోషంగా ఉండేది. సీజన్ 2లో నేను లేను కాబట్టి నాని గురించి నేను ఎక్కువగా చెప్పలేక పోతున్నాను. నాని గారుకూడా మంచి టాలెంట్ ఉన్న యాక్టర్. ఆయన మున్ముందు షోను మరింత అద్భుతంగా ముందుకు నడుపుతారని అనుకుంటున్నాను అని మధు ప్రియ తెలిపారు.


Click it and Unblock the Notifications











