వర్మ 'డిపార్టమెంట్'లో హైలెట్ ఆ పాత్ర
డిపార్టమెంట్ చిత్రం పోలీస్ వ్యవస్దకి,అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ మధ్యన ఉండే సంభందాలని ముఖ్య కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది.దీంట్లో అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను పోషిస్తున్నాడు.సంజయ్ దత్ అండర్ వరల్డ్ ని సమూలనంగా నాశనం చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్ వేస్తున్నారు.అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు.విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నారు.వీళ్లు కాకుండా తెలుగులోని దగ్గుపాటి రానా,లక్ష్మి మంచు,మధు షాలని కూడా చాలా ముఖ్యపాత్రల్లో ఉన్నారు.రానా దగ్గుపాటి ఒక పోలీస్ పాత్రను పోషిస్తున్నారు.లక్ష్మిమంచు సంజయ్ దత్ భార్య పాత్రని పోషిస్తోంది.మధు షాలిని ఫిమేల్ గ్యాగస్టర్ రోల్ ని పోషిస్తోంది.ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు నవంబర్ లో ముగించుకుని పిభ్రవరిలో రిలీజ్ చెయ్యటానికి సన్నాహాలు చేసుకుంటోంది.ఇక మధుశాలిని పాత్ర సినిమాకి హైలెట్ కానుందని చెప్తున్నారు.ఆమె సినిమా అంతా పూర్తిగా సిగెరెట్ కాలుస్తూంటుంది.ఆమె ఇంతకాలం సాఫ్ట్ రోల్ లో కనిపించింది.ఇప్పుడు చాలా వైల్డ్ గా ఉండే పాత్రలో అదరకొట్టనుందని,ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











