నిద్రలేని రాత్రులేమీ గడపటం లేదు:మధుశాలిని

By Srikanya

ఆమె కేవలం ఐటం గర్ల్ గా చేస్తోంది. నేను ఓ కీ రోల్ చేస్తున్నాను...నాకూ ఆమెకూ పోటీనా అంటోంది మధుశాలిని. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం డిపార్టమెంట్ లో నటిస్తున్న మధుశాలిని ఇప్పుడు బ్రెజిల్ భామ నతాలియా సీన్ లోకి రావటంతో ఇన్ సెక్యూరిటీ ఫీలవుతున్నట్లుది. ఆమెను మీడియా వారు ఇదే విషయమై ప్రశ్నించగా పై విధంగా స్పందించింది. అలాగే ఆమె కోసం నేను నిద్రలేని రాత్రులు గడపాల్సిన పనేమిలేదు అని తేల్చేసింది. అయితే ఆమె హాట్ అనటంలో మాత్రం డౌటేమీ లేదని,దానితోటే ఆమె మీడియాలో మైలేజి సాధించిందని అంది.

అలాగే నటాలియా కేవలం ఐటం గర్ల్ గానే కాక వర్మ మరో చిత్రం అందంలోనూ హీరోయిన్ గా చేయటం గురించి మాట్లాడుతూ..మంచిదే..నాకూ బాలీవుడ్ ఆఫర్స్ బోలెడు వస్తున్నాయి. అయితే నేను మంచి పాత్ర,కథ,బ్యానర్ అని ఎంచుకుంటున్నాను అంది. తనను ఎక్సైట్ చేయలేని ప్రాజిక్ట్ కమిటవటం ఇష్టం లేక ఏ కొత్త సినిమానూ ఒప్పుకోలేదని అంది. అయితే తప్పకుండా బాలీవుడ్ లో పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తానని నమ్మకం వ్యక్తం చేసింది.

మరి మంచు లక్ష్మికి కూడా నటాలియా పోటీగా మారుతుందా అంటే...మంచు లక్ష్మి,నేను ఇద్దరం నటనమీద,ఫెరఫార్మెన్స్ మీద ఆధారపడి కెరీర్ నిర్మించుకుంటున్నాం. సినిమా విడుదల అయ్యాక జనం ఎవరని మెచ్చుకుంటారో చూడండి అని చెప్పింది. అప్పటివరకూ ఈ కొత్త ఐటం గర్ల్ ని ఎంజాయ్ చేయనివ్వండి అంది. అంతేగాక కొద్ది కాలం లైమ్ లైట్ ఉండటం ఏ ఆర్టిస్టుకైనా మంచిందే. ప్రస్తుతం ఆమె ఆ పీరియడ్ లో ఉంది అని చెప్పింది.

ఇంతకు ముందు వర్మ నతాలియా అందచందాల గురించి తెగ పొగిడేసిన విషయం తెలిసిందే. నతాలియా లాంటి అందాన్ని నేను నా సినీ కెరీర్లో ఇదివరకెప్పుడూ చూడలేదని, ఆమె అందం చూసి పిచ్చిక్కిపోతోందని......హింసాత్మక ఘటన నేపథ్యంలో రక్తచరిత్ర సినిమా రూపొందించినట్లుగా, ఆమె 'అందం' గురించి అంతా చర్చించుకునేట్లుగా ఓ సినిమా తీయనున్నట్లు కూడా ప్రకటించారు వర్మ. ఇక మధుశాలిని ప్రస్తుతం పొగ చిత్రం లో నవదీప్ సరసన చేస్తోంది. తన పాత్ర సినిమాలో కీలకమని చెప్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X