రామ్ గోపాల్ వర్మ ‘భూత్ 2’లో మధుశాలిని?
రామ్ గోపాల్ 'డిపార్ట్ మెంట్' చిత్రంలో అవకాశం దక్కించుకున్న తెలుగు భామ మధుశాలినికి వర్మ మరో అవకాశం ఇచ్చాడు. వర్మ రూపొందిస్తున్న 'భూత్ 2' చిత్రంలో ఆమెను మెయిన్ హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలో దీనిపై వర్మ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
దక్షిణాదిన చిన్న సినిమాల్లో రాణిస్తూ...అడపా దడపా అవకాశాలతో నెగ్గుకొస్తున్నమధుశాలినిని రామ్ గోపాల్ వర్మ ఏకంగా బాలీవుడ్‌కి తీసుకెళ్లి తన డిపార్ట మెంట్ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఈచిత్రంలో సిగరెట్లు తాగుతూ, మందుకొడుతూ ఉండే లేడీ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఈ భామ నటిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రంలో మధు శాలినితోనే ఓ ఐటం సాంగు చేయిస్తానని మాట ఇచ్చిన వర్మ తర్వాత..మాట తప్పి బ్రెజిల్ సెక్సీ మోడల్ నతాలియాను తీసుకున్నాడు. నాకు మాట ఇచ్చి ఆమెను ఎందుకు తీసుకున్నావ్ అంటూ మధు శాలిని ప్రశ్నిస్తే...సంజయ్ దత్ నిన్ను ఐటం సాంగులో వద్దన్నాడని ఏవో సాకులు చెప్పాడట. దీంతో మధు శాలిని అసంతృప్తికిగురైంది.
అప్పుడు హ్యాండిచ్చిన వర్మ...ఇప్పుడు మళ్లీ తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇవ్వడం ద్వారా ఆమెను సంతృప్తి పరుస్తున్నాడని బాలీవుడ్ టాక్. డిపార్టుమెంట్ చిత్రంలో మధు శాలినితో పాటు, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











