ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ.. అంతా అబద్దమే..!
త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ తొలి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి చిత్రం పరాజయం తరువాత త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న చిత్రం ఇది. అదేవిధంగా ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దీనితో వీరిద్దరికి ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా మారింది. అజ్ఞాతవాసి చిత్రం తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా గురించి మీడియాలో ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.
Recommended Video


అనిరుద్ గురించి గుసగుసలు
అజ్ఞాతవాసి చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ పై ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. చిత్రం రెగ్యులర్ షూటింగ్ దగ్గర పడే కొద్దీ సినిమాపై పూర్తి క్లారిటీ వస్తోంది. ఈ చిత్రానికి అనిరుద్దే సంగీత దర్శకుడిగా కొనసాగనున్నాడు.

అతడి నవల ఆధారంగా అంటూ వార్తలు
అ.. ఆ.. చిత్రాన్ని నవల ఆధారంగా తెరకెక్కించిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాకు కూడా నవలనే నమ్ముకున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అవి కూడా పుకార్లే అని తేలిపోయింది.నవల రచయిత మధుబాబు దీనిపై క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు త్రివిక్రమ్ కథ కోసం తనని సంప్రదించలేదని వివరణ ఇచ్చాడు.

కొందరైతే శృతిమించిపోయారు
ఈ సినిమాపై ఇబ్బడి ముబ్బడిగా పుకార్లు పుడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందంటూ కూడా కొనరు వార్తలు సృష్టించేశారు. కానీ దర్శకుడు త్రివిక్రమ్ సలక్షణంగా ఈ చిత్రానికి సంబదించిన ప్రిప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇలాంటి శృతిమించే వార్తలు కొందరు సృష్టిస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇద్దరు విభిన్న వ్యక్తులు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ చిత్రాలు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసేవిగా ఉంటాయి. తనదైన శైలిలో వినోదం అందిస్తూ త్రివిక్రమ్ మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకోగలరు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఎలాంటి చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది.

మార్చిలో మొదలు
నటీనటుల ఎంపిక మరియు ఇతర ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాల్లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. మార్చి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ సరనస నటించే హీరోయిన్ విషయంలో మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











