దర్శకుడు నన్ను 23 సార్లు రేప్ చేశాడు
ఓ గౌరవనీయమైన దర్శకుడు మీద ఒక్కసారిగా హీరోయిన్ ఈ దర్శకుడు నన్ను 23 సార్లు రేప్ చేశాడు అని తీవ్రమైన ఆరోపణ చేస్తుంది. ఆ సిట్యువేషన్ లో ఆ దర్శకుడు ఈ ఆరోపణల నుంచి, పోలీసుల కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఇలాంటి ఆసక్తికరమైన కథతో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'మధుబాల'. సమీర్, కనిష్క జంటగా నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు నిర్మాత ముత్యాల రాందాస్. అలాగే ఆయన ఈ చిత్ర కథాంశం మీడియాకు వివరించారు. అలా రేప్ కేసులో ఇరుక్కుపోయిన ఆ దర్శకుడు ఒకవైపు పరిశ్రమ వర్గాల వారి అనుమానపు చూపులు, మరో ప్రక్క పోలీసుల ఒత్తిడి..అభిమానుల ఆందోళన..ఇవన్నీ తట్టుకోలేక ఆ దర్శకుడు కాళ్లబేరానికి సిద్ధమవుతాడు.
అప్పుడు ఆ హీరోయిన్ ఏం చేసింది? ఆమె ఆరోపణలో నిజమెంత? అన్న దిశలో కథనం నడుస్తుంది. చలన చిత్ర పరిశ్రమలోని వాస్తవ సంఘటనలను వివరిస్తూ, తారాస్థాయికి చేరుకోవటానికి కొంతమంది వర్థమాన తారలు పడే అగచాట్లు ఎలా వుంటాయనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం అన్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. ధర్మాక్షరి, గురుప్రీత్ సింగ్, అతిథి, అజయ్ భార్గవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: సింగిరెడ్డి రంగారెడ్డి, సహనిర్మాత: సందిప్.జి. దర్శకత్వం: శివరామ్ యాదవ్.ఇక ఈ చిత్రం మధూర్ బండార్కర్ పై ఓ మోడల్ రేప్ చేసారంటూ చేసిన ఆరోపణలు ఆధారంగా నిర్మిస్తున్నారంటూ అంతటా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











