సెక్స్ వర్కర్ పాత్రలో ‘మధుమతి’గా ఉదయభాను, ఆడియో వేడుకకు గైర్హాజరుపై నిర్మాతల ఆగ్రహం

By Bojja Kumar

హైదరాబాద్: టీవీ యాంకర్ ఉదయభాను 'మధుమతి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆడియో వేడుక జరుపుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 24న విడుదలకు సిద్ధం కాబోతోంది. అయితే ఇటీవల జరిగిన ఆడియో వేడుకకు ఉదయభాను గైర్హాజరవ్వడంతో అంతా షాకయ్యారు. ఉదయభాను తీరుపై ఆగ్రహంగా ఉన్న నిర్మాతలు ఆమెపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఉదయభాను గౌర్హాజరవ్వడంపై ఆ చిత్ర దర్శకుడు రాజ్ శ్రీధర్ మాట్లాడుతూ...'మధుమతి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి ఉదయభాను హాజరు కాకపోవడంపై నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నారు. సినిమా ప్రమోషన్లో ఆడియో వేడుక ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఎలాంటి కారణం చెప్పకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆమె గైర్హాజరయ్యారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

షూటింగు సమయంలో కూడా ఉదయభాను అనేక ఇబ్బందులకు గురి చేసిందని దర్శకుడు వెల్లడించారు. తొలుత స్పెషల్ సాంగులో చేస్తానని అంగీకరించి...తీరా షూటింగుకు అంతా సిద్ధమైన తర్వాత నిరాకరించిందని, దాంతో వేరే వారితో ఆ సాంగును పూర్తి చేసామని దర్శకుడు తెలిపారు. అయితే ఈ సంఘటనపై స్పందించడానికి ఉదయభాను అందుబాటులో రాలేదు.

మధుమతి చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న ఉదయభాను ఈ చిత్రంలో సెక్స్ వర్కర్‌గా కనిపించబోతోంది. ఈ చిత్రంలో దీక్షాపంథ్, విష్ణు ప్రియన్, సీతా, ప్రభాస్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కడియం రమేష్, కె. రాణి శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

మధుమతిలో మసాలా ఎలిమెంట్స్

మధుమతిలో మసాలా ఎలిమెంట్స్


ఈ చిత్రానికి రాజ్ శ్రీధర్ దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. కామెడీ, యాక్షన్, డ్రామా, టెంపో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందట.

మధుమతి స్టోరీ

మధుమతి స్టోరీ


విచ్చలవిడిగా తిరిగే ఒక తెలుగు అమ్మాయిని అనుకోని పరిస్థితులో తమిళ అబ్బాయి తన ఇంటికి తీసుకెళ్ళడంతో ఎదురయ్యే పరిణామాలు‌ను తనకి అనుగుణం ఎలా మలుచుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ. ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా చిత్రీకరిస్తున్నాం అని అంటున్నారు దర్శకుడు.

నటీనటులు

నటీనటులు


ఉదయభాను, దీక్ష్, శివకుమార్, గౌతమ్, సీత, తెలంగాణ శకుంతల, ప్రభాస్ శ్రీను, కమెడియన్ వేణు, సతీష్, బస్టాప్ కోటేశ్వరరావు, నాగభైరవ అరుణ్ కుమార్ తదితరులు నటించారు.

మధుమతి సంగీతం

మధుమతి సంగీతం


ఈ చిత్రానికి రాజ్ శ్రీధర్ లిరిక్స్ అందించగా...రాజ్ కిరణ్ ట్యూన్స్ కంపోజ్ చేసారు. రాజ్ కిరణ్, అంజనా, సౌమ్య, భార్గవి పిల్లై, సురేష్ పాటలుపాడారు.

టెక్నికల్ టీం

టెక్నికల్ టీం


సత్య వి ప్రభాకర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసారు. శ్రీను మేకప్ వర్క్, రాజు కాస్టూమ్స్, సురేష్ డాన్సింగ్ కొరియోగ్రఫీ, పాంథర్ నాగరాజు యాక్షన్ కొరియోగ్రాఫీ సినిమా ప్రధాన ఆకర్షణలు

మధుమతి రిలీజ్ డేట్

మధుమతి రిలీజ్ డేట్


మధుమతి చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో 24వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X