డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ, పెళ్లి వంటి వ్యవహారాలు సర్వసాధారణమే. అలా ఒకప్పుడు మంచి పీక్స్‌లో ఉన్న శివ బాలాజీ, మధుమితలు ప్రేమించుకున్నారు. తరువాత కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ ఇద్దరి అన్యోన్య కాపురాన్ని చూసి నెటిజన్లు ముచ్చట పడుతుంటారు. ఒకరిపై ఒకరు తమకున్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో బయటపెట్టారు.

బిగ్ బాస్ సమయంలోనూ..
బిగ్ బాస్ మొదటి సీజన్ సమయంలోనూ శివ బాలాజీకి మధుమిత బాగా సపోర్ట్ చేసింది. శివ బాలాజీకి వ్యతిరేకంగా వచ్చిన పోస్ట్‌లు, జరిగిన ట్రోలింగ్‌కు మధుమిత ధీటుగా నిలబడింది. శివ బాలాజీ చేత మసాజ్ చేయించుకోవడంపైనా మధుమిత స్పందించింది.
నివేథా పేతురాజ్ బ్యూటీఫుల్ గ్యాలరీ..

అలా మొదటగా..
మధుమిత మొదటగా తమిళంలో బాగా బిజీగా ఉన్న సమయంలోనే శివ బాలాజీతో ఓ సినిమా చేయాల్సి వచ్చిందట. అప్పటికే తాను సీనియర్ అని.. శివబాలాజీ సినిమాల పరంగా కాస్త జూనియర్ అని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా తమిళంలో అప్పటికే నాలుగైదు సినిమాల్లో నటించిందట. అలా తమిళంలోని సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట.

తాజాగా అలా..
పెద్దలు మొదటగా ఒప్పుకోకపోయినా చివరకు అందరినీ ఒప్పించి మరీ వివాహాం చేసుకున్నారు. ఇప్పుడు వారిద్దరికి ఇద్దరు పిల్లలు. తాజాగా శివ బాలాజీ, మధుమితలు సుమ నిర్వహిస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో అతిథులుగా విచ్చేశారు. అందులో తమ వ్యక్తిగత విషయాలను చెప్పి అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేశారు.

రాత్రి పూట..
భార్య నిద్రపోయాక రాత్రి పూట భర్తలు ఫోన్‌ను వాడతారని శివ బాలాజీ చెప్పుకొచ్చాడు. ఎవరైనా ఆడవాళ్లు మెసెజ్ చేసినా కూడా మధుమితకు శివ బాలాజీ ముందుగానే చెప్పేస్తాడట. అలా ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

డెలివరీ సమయంలో..
అయితే మధుమితకు డెలివరీ సమయంలో.. ఐదో నెలలోనే బిడ్డకు ప్రమాదం ఉందని, మెదడు ఎదగదని డాక్టర్లు చెప్పారట. మీరు మీ బిడ్డను ఎలాగైనా పెంచుకుంటారు. కానీ సమాజం మాత్రం అలా చూడదంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారట. అయినా పర్లేదు అని ఆ బిడ్డను కన్నామంటూ చెబుతూ ఇద్దరూ కన్నీరు పెట్టేసుకున్నారు.


Click it and Unblock the Notifications











