వేషం ఇస్తాడనే ఆ దర్శకుడుతో సెక్స్ లో...

By Srikanya

1999 నుంచి 2004 వరకూ 16 సార్లు తామిద్దరూ సెక్స్ లో పాల్గొన్నామని..వేషం ఇస్తాడనే అలా చేసానని అప్పట్లో దర్శకుడు మధూర్ బండార్కర్ పై ప్రీతీజైన్ అనే అనే మోడల్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు ఇన్నాళ్లకు ఒక కొలిక్కి వచ్చింది. ఐదైళ్ళ అనంతరం ప్రీతి జైన్ పై అత్యాచారం కేసులో మాధుర్ బండార్కర్ ను సిటీ కోర్టు దోషిగా నిర్దారించింది. ప్రీతి జైన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐదేళ్ల తర్వాత ఈ తీర్పు వచ్చింది. తన చిత్రాల్లో హీరోయిన్ పాత్ర ఇస్తానని దర్శకుడు మధూర్ బండార్కర్ తనకు మాటిచ్చాడనీ, శారీరకంగా వాడుకున్నాడని..అయితే తనకు ఏ సినిమాలోనూ అవకాశమివ్వలేదనీ ఆమె ఆ పిర్యాదులో తెలిపింది.

తాను ప్రతిఘటించినప్పుడల్లా తనపై అతను అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. అలాగే బండార్కర్ ఐదేళ్లలో 'చాంద్ నీ బార్', 'సత్తా', అనే చిత్రాలు తీసిన విషయం తనకు తెలుసనీ, ఏ ఒక్క సినిమాలోనూ తనను ఆయన తీసుకోలేదనీ, విడుదలకు సిద్ధంగా ఉన్న 'పేజీ 3'లోనూ(అప్పటికీ) తాను లేనని మాధుర్ పై కేసు నమోదు చేసిన సమయంలో మీడియాతో జైన్ చెప్పింది. తనను పెళ్లి చేసుకుని స్టార్ ను చేస్తానని కూడా బండార్కర్ వాగ్దానం చేసినట్టు కూడా పేర్కొంది. ఇక ప్రస్తుతం మధూర్..జైల్ చిత్రం పరాజయ భారంతో దిగులుగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X