కాపీ కొట్టారంటూ ఆ దర్శకుడుని కోర్టుకి
బాలీవుడ్ దర్శకుడు మధూర్ బండార్కర్ కి టైమ్ కలసివస్తున్నట్లు లేదు. ఆయన ప్రారంభించిన హీరోయిన్ చిత్రం ఊహించని విధంగా ఐశ్వర్యా రాయ్ గర్భవతి కావటంతో ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు ఆయన గతంలో రూపొందించిన జైలు చిత్రం నిమిత్తం కోట్లు గుమ్మం ఎక్కాల్సిన పరిస్దితి వచ్చింది. ముంబైకి చెందిన సురేంద్ర తన్వర్ అనే స్కిప్టు రైటర్ ఆ కథ తనదేనంటూ కోర్టుకి ఎక్కటంతో మధూర్ చిక్కుల్లో పడ్డారు. తన్వర్ ఏమంటున్నారంటే తను రాసిన గున్మామ్ కి దేవతా అనే కథ నుంచి ఈ సినిమా ఎత్తారని, ఆ కథను తాను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసానని అన్నారు. ఇక జైలు చిత్ర కథకి రచయిత పేరుగా దిలీప్ శుక్లా పేరు వేసారు. దిలీప్ శుక్లా గతంలో కొంతకాలం అసెస్టెంట్ రైటర్ గచా సురేంద్ర వద్ద పనిచేసారు. ఈ ఆదారాలతో ఈ విషయం కోర్టుకి ఎక్కింది. మధూర్ మరి ఈ విషయమై ఎలా స్పందిస్తాడో చూడాలంటున్నారు. మధూర్ తనకేమీ తెలియదని,తన రైటర్ తెచ్చిన కధను తీసాను అంటాడని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











