మన ఫ్లాఫ్ హీరోకు ...బాలీవుడ్లో భారీ డిమాండ్

By Staff

Deepak
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం మధూర్ బండార్కర్ ఫ్యాషన్ సినిమా వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ స్ధితిలో ఆ సినిమాలోని హీరో,హీరోయిన్స్ కి ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరో మరెవరో కాదు. దీపక్. గుర్తురావటం లేదా.సానా యాదిరెడ్డి సంపెంగి,బి.జయ ప్రేమలో పావనీ కళ్యాణ్ చిత్రాల్లో హీరో,రవితేజ భధ్ర లో స్నేహితుడు పాత్ర వేసాడు. అతను బాలీవుడ్ హైయిస్ట్ డిమాండ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రక్కన హీరోగా కనపడుతున్నాడు. మరి ఈ అవకాశం ఎలా వచ్చిందీ అంటే మదూర్ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాడని తెలిసి ఫొటోలతో ఎప్రోచ్ అయ్యాడుట.

ఓ ఫ్రెష్ కుర్రాడిలా బిల్డప్ ఇచ్చాడుట. అందులోనూ అతను అసలు పేరు అర్జున్ బాజ్య కావటంతో అసలు ఫ్యాష్ బ్యాక్ తెలియలేదుట. తర్వాత విషయం బయిటపడి అడిగితే కంగారుపడ్డాడు దీపక్. అయితే మధూర్ అప్పుడు నువ్వు చేసింది డమ్మీ అనుకో...ఇకనుంచీ నువ్వు చేసేదే అసలైన కెరీర్ అని చెప్పి మీడియా ముందు గత సినిమాలు ఊసు ఎత్తద్దన్నాడని తెలుస్తోంది. ఎంతో హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో అతని అవకాశాలకు లోటుండదనేది సుస్పష్టం. ఇప్పటికే వరస ఆఫర్లు వచ్చిపడుతున్నాయిట. అయితే సినిమా రిలీజయ్యాకే కమిట్ అవుతానని చెప్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X