twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ కేసులో మధుర్ బండార్కర్‌కు బెయిల్

    By Bojja Kumar
    |

    ప్రీతిజైన్ రేప్ కేసులో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బండార్కర్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కోర్టు పర్మిషన్ లేకుండా బండార్కర్ దేశం వదలి వెళ్లడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో ఆదేశించింది. అతని పాస్ పోర్టును కోర్టులో డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. కేసు తదుపరి విచారణ నవంబర్ 29కి వాయిదా వేసింది.

    ప్రితి జైన్ అనే మహిళ 2004 జులైలో మధుర్ బండార్కర్ తనపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు చేస్తూ కేసు వేసింది. తనను పెళ్లి చేసుసుకుంటానని, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ప్రలోభ పెట్టి మధుర్ తనను లొంగదీసుకుని పలుసార్లు అత్యాచారం చేశాడని ప్రీతి జైన్ తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.

    మూడు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకున్న మధుర్ బండార్కర్....వాస్తవ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చాందినీ బార్, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్ చిత్రాలు నిర్మించారు.

    English summary
    Bollywood film director Madhur Bhandarkar has been granted bail on Monday in Preeti Jain rape case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X