రేప్ కేసులో మధుర్ బండార్కర్‌కు ఊరట
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బండార్కర్‌పై రేప్ కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఆయనపై విచారణ నిలిపి వేస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాధుర్‌కు ఊరట లభించినట్లయింది.
గతంలో ఆయనకు ఈ కేసులో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు పర్మిషన్ లేకుండా బండార్కర్ దేశం వదిలి వెళ్లడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో ఆదేశించింది. అనంతరం ఆయన తనపై జరుగుతున్న విచారణ నిలిపి వేయాలంటూ కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పై ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రీతిజైన్ అనే మహిళ 2004 జులైలో మధుర్ బండార్కర్ తనపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు చేస్తూ కేసు వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ప్రలోభపెట్టి మధుర్ తనను లొంగదీసుకుని పలుసార్లు అత్యాచారం చేశాడని ప్రీతిజైన్ తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.
మూడు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకున్న మధుర్‌బండార్కర్… వాస్తవ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చాందినీ బార్, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్ చిత్రాలు నిర్మించారు.


Click it and Unblock the Notifications











