'జైలు'కు వెళ్ళనున్న దర్శకుడు?

By Staff

Madhur Bhandarkar
రీసెర్చి చేస్తూ వాస్తవిక చిత్రాలు రూపొందించే మధూర్ బండార్కర్ తాజా చిత్రం ఫ్యాషన్ చిత్రం రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే అదేమీ పట్టించుకోకుండా ఈ దర్శకుడు తన తర్వాత చిత్రం జైలు కోసం రీసెర్చ్ ప్రారంభించాడు. అందుకోసం అప్పుడే జైలు అధికారులును సంప్రదించి ఫర్మిషన్స్ సంపాదిస్తున్నాడు. నీల్ ముఖేష్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న ఈ చిత్రంలో అతను పరాగా దీక్షిత్ అనే సామాన్యుడు పాత్రను ఫోషిస్తున్నాడు. అతను అనుకోని పరిస్ధితుల్లో జైలుకెళ్తాడు. అక్కడ ఎలాంటి పరిస్ధితులు ఎదుర్కొన్నాడు. మిగతా వాళ్ళ జైలు జీవితం ఎలా ఉందనేది ప్రధాన అంశంగా ఈ సినిమా సాగుతుంది.

ఓ ఖైదీ పాయింట్ ఆఫ్ వ్యూ జైలు వాతావరణాన్ని ప్రదర్శిస్తానంటున్నాడు మధూర్. ఇక ఈ చిత్రం ఆలిస్టర్ పెర్రియార అనే వ్యక్తి జీవితం ఆధారంగా సాగుతుందని వార్తలు వినపడుతున్నాడు. అతను ముంబయిలో ఓ రాత్రి పేవ్ మెంట్స్ పై నిద్రపోతున్న లేబర్ పై కారు పోనిచ్చి ఎంతో మంది మరణానికి కారణమయ్యాడు. ఇక అప్పటివరకూ ఒక రకమైన జీవితాన్ని గడిపిన అతను హఠాత్తుగా అతను జైలు పాలవటాన్ని జీర్ణించుకోలేకపోతాడు.

ఫెర్సపెక్ట్ పిక్చర్స్ కంపెనీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారే ఈ విషయాన్ని మీడియా వద్ద నిర్దారించారు. అయితే మధూర్ ఈ విషయం పై కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. ఓ పదిహేను రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళడిస్తానంటున్నాడు.ఇక గతంలో మధూర్ పేజ్ త్రి,కార్పోరేట్,చాందినీ బార్,ట్రాఫిక్ సిగ్నల్ వంటి చిత్రాలను రూపొందించి అంతులేని పేరు సంపాదించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X