»   »  సినిమా మొత్తం అందగత్తెల స్విమ్‌ సూట్‌ సీన్లే

సినిమా మొత్తం అందగత్తెల స్విమ్‌ సూట్‌ సీన్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ముంబై : సినిమాలో ఎక్కడో ఒకసారి స్విమ్‌ సూట్‌ ని హీరోయిన్ వేస్తేనే ఆ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్. అలాంటిది. సినిమాలో ఎక్కువ భాగం స్విమ్ సూట్ సీన్ల చుట్టూ తిరిగితే...ఇంకేముంది. అలాంటి సినిమా ఒకటి త్వరలో మన ముందుకు రాబోతోంది. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని హాట్ సీన్స్ కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏమిటా సినిమా అంటే ఈ కథనం చదవాల్సిందే.

    మన సమాజంలోని వాస్తవిక పరిస్థితులను తెరకెక్కించే దర్శకుడిగా మధుర్‌ భండార్కర్‌కు మంచి పేరుంది. ప్రస్తుతం ఈయన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ప్రతి సంవత్సరం రూపొందించే 'కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌' ఇతివృత్తంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు హిందీ చిత్రపరిశ్రమలో షికారు చేస్తున్న తాజా వార్త. అయితే ఈ సినిమాలో స్విమ్‌ సూట్‌ సీన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండబోతోంది.

     Madhur Bhandarkar is all ready to bring in his next realistic film, Calendar Girls.

    ప్రతి సంవత్సరం బికినీ భామలతో రూపొందించే ఈ క్యాలెండర్‌కు గ్లామర్‌ ప్రపంచంలో మంచి పేరుంది. స్విమ్‌ సూట్‌ అందగత్తెలతో మలిచే ఈ క్యాలెండర్‌ ద్వారా మాల్యా తన వ్యాపారానికి ప్రచారం చేసుకోవడంతో పాటు ఆ సుందరాంగులకు మెరుగైన మోడలింగ్‌తో పాటు వీరు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించే అవకాశాన్ని ఇస్తుంటారు.

    విజయ్‌ మాల్యా ఈ కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌పై మెరిసిన తరువాతే దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌ వంటి హీరోయిన్లు సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం వారు సినీ వినీలాకాశంలో ఏ స్థాయిలో వెలిగిపోతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అందుకే దీనికంతటికీ సూత్రధారి అయిన మాల్యా జీవితం కూడా ఈ చిత్రంలో చోటుచేసుకోవచ్చు.

    ప్రస్తుతం ఈ చిత్రం కోసం నటీమణుల వేటలో ఉన్నారట మధుర్‌ భండార్కర్‌. మోడళ్లుగా రాణించి ప్రస్తుతం నటీమణులుగా వెలుగొందుతున్న పలువురు సినీ తారలు ఈ చిత్రంలో నటించవచ్చునని బాలీవుడ్‌ పండితులు భావిస్తున్నారు.

    English summary
    Madhur Bhandarkar is all ready to bring in his next realistic film, Calendar Girls.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more