ఫస్ట్ లుక్ : బికినీలో ఐదుగురు హీరోయిన్స్ (ఫొటో)

By Srikanya

ముంబై : ఏదో ఒకటి కొత్తగా చేయకపోతే జనం దృష్టిని ఆకర్షించటం కష్టంగా ఉంది. ఆ విషయం వర్మ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్లకు బాగా తెలుసు. వర్మ శిష్యుగా కెరీర్ మొదలెట్టి తనకంటూ కీర్తి ప్రతిష్టలు పొందిన దర్శకుడు మధూర్ భండార్కర్. ఆయన తన తాజా చిత్రం కోసం ఫస్ట్ లుక్ ని వదిలి అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తాజా చిత్రం కేలండర్ గర్ల్స్ కు రంగం సిద్దం చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వదిలారు. ఈ పోస్టర్ లో గోల్డ్ కలర్ బికినీ ధరించిన ఐదుగురు భామలు ముఖాలు కనిపించకుండా టోపీలు అడ్డం పెట్టి వదిలారు. దాంతో ఎవరా అందగత్తెలు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వీరు ఎవరనేది సినిమా రిలీజ్ కు ముందు వదిలే టీజర్ లోనే చెప్పేలనే నిర్ణయీనికి వచ్చినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో ఎక్కువ భాగం స్విమ్ సూట్ సీన్ల చుట్టూ తిరిగితే...ఇంకేముంది. అలాంటి సినిమా ఒకటి త్వరలో మన ముందుకు రాబోతోంది. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని హాట్ సీన్స్ కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

Madhur Bhandarkar keeps his Calendar Girls under wraps

మన సమాజంలోని వాస్తవిక పరిస్థితులను తెరకెక్కించే దర్శకుడిగా మధుర్‌ భండార్కర్‌కు మంచి పేరుంది. ప్రస్తుతం ఈయన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ప్రతి సంవత్సరం రూపొందించే 'కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌' ఇతివృత్తంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో స్విమ్‌ సూట్‌ సీన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండబోతోంది.

ప్రతి సంవత్సరం బికినీ భామలతో రూపొందించే ఈ క్యాలెండర్‌కు గ్లామర్‌ ప్రపంచంలో మంచి పేరుంది. స్విమ్‌ సూట్‌ అందగత్తెలతో మలిచే ఈ క్యాలెండర్‌ ద్వారా మాల్యా తన వ్యాపారానికి ప్రచారం చేసుకోవడంతో పాటు ఆ సుందరాంగులకు మెరుగైన మోడలింగ్‌తో పాటు వీరు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించే అవకాశాన్ని ఇస్తుంటారు.

విజయ్‌ మాల్యా ఈ కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌పై మెరిసిన తరువాతే దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌ వంటి హీరోయిన్లు సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం వారు సినీ వినీలాకాశంలో ఏ స్థాయిలో వెలిగిపోతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అందుకే దీనికంతటికీ సూత్రధారి అయిన మాల్యా జీవితం కూడా ఈ చిత్రంలో చోటుచేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X