రేప్ కేసులో రిలీఫ్ - మళ్లీ కరీనాతో షురూ..!
బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ కరీనా కపూర్ ప్రధాన పాత్రలో 'హీరోయిన్' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రంగుల ప్రపంచంలో అందాలు ఒలికిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే హీరోయిన్ల జీవితం తెర వెనక ఎలా ఉంటుంది? అనే అంశాన్ని మాధుర్ ఈ చిత్రంలో చూపెట్ట బోతున్నాడు.
అప్పుడెప్పుడో ప్రారంభమైన ఈచిత్రం షూటింగ్ కొన్ని నెలలుగా సాగడం లేదు. అందు కారణం మధుర్ బండార్కర్ రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొనడమే. మధుర్ బండార్కర్ తనను అత్యాచారం చేశాడంటూ ప్రీతి జైన్ అనే మహిళ అతన్ని కోర్టు కీడ్చింది. అయితే ఎట్టకేలకు ఈ కేసులో సుప్రీం కోర్టు నుంచి మధుర్‌కు ఊరట లభించింది.
రేప్ కేసులో ఊరట లభించడంతో మధుర్ బండార్కర్ అజ్మీర్ దర్గాలో ప్రత్యక్షమయ్యాడు. తనపై విచారణ నిలిపి వేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఫుల్ హ్యాపీగా ఉన్న మధుర్ బండ్కార్ దర్గాను దర్శించి మొక్కు తీర్చుకున్నాడు.
గతంలో చాందినీ బార్, ఫ్యాషన్, పేజ్ 3 చిత్రాలను అద్భుతంగా....సందేశాత్మకంగా ఉండటంతో పాటు, శృంగార మసాలా కూడా బాగా దట్టించి రూపొందించిన మాధుర్ బండార్కర్ ఈ చిత్రంలో కూడా తన రేంజ్ చూపించడానికి సిద్ధం అవుతున్నాడు. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవలం 20 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











