హీరోయిన్ గర్బవతి కాదని దర్శకుడు క్లారిఫికేషన్
ఆమె గర్బవతి కాదు...లేనిపోని రూమర్స్ సృష్టించవద్దని దర్సకుడు మధూర్ బండార్కర్ క్లారిఫై చేసారు. ఆయన కొద్ది రోజుల క్రితం కరీనాకపూర్ గర్బంతో ఉన్న ఫోటో అంటూ ఓ ఫోటోని ట్విట్టర్ లో పెట్టాడు. దాంతో ఆమెతో పనిచేసే దర్శకుడే ఫోటో పెట్టడంతో మీడియో మొత్తం కరీనాకపూర్ పెళ్లికి ముందే గర్బవతి అంటూ కథనాలు ప్రసారం చేసింది. అయితే ఆ ఊహాగానాలు మితిమీరటంతో కరీనాకపూర్ ని మీడియా ప్రశ్నించటం మొదలు పెట్టింది. ఈ నేపధ్యంలో మళ్లీ మధూర్ బండార్కర్ స్వయంగా అది సినిమాలో ఫోటోనో..అనవసరమైన రూమర్స్ క్రియోట్ చెయ్యద్దు అన్నారు.
ఇక ఆ ఫోటో రావటానికి కారణం...కరీనాకపూర్ ప్రస్తుతం మధుర్ దర్శకత్వంలో 'హీరోయిన్' అనే చిత్రం చేస్తోంది. మహి అరోరా, రేఖ, మనీషా కొయిరాలా తదితర కథానాయికల జీవితాలే ఈ కథకి స్ఫూర్తి అనే ప్రచారం సాగుతోంది. ఇందులోని కొన్ని సన్నివేశాల్లో కరీనా గర్భవతిగా నటించింది. ఆ సమయంలో సెట్లో తీసిన ఓ ఫొటోని దర్శకుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో 'కరీనా నిజంగా గర్భవతట' అనే రూమర్స్ మొదలయ్యాయి చేశాయి. చివరికి మధుర్ దిగొచ్చి.. 'అది సినిమాలోని ఫొటోనే. అనవసరంగా పుకార్లు సృష్టించొద్దు' అని చెప్పాడు. ప్రస్తుతం కరీనా సైఫ్ అలీఖాన్ సరసన 'ఏజెంట్ వినోద్' చిత్రంలో నటిస్తోంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రామ్‌లీల' చిత్రంలోనూ కథానాయికగా కరీనాని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. షేక్‌స్పియర్ 'రోమియో జూలియట్' నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











