twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు చిత్రం రీమేక్ పై మధూర్ బండార్కర్ ట్వీట్

    By Srikanya
    |

    చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలించిన 'ఠాగూర్‌' చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మొదట అక్షయ్ కుమార్ హీరోగా చేస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ లోకి షారూఖ్ వచ్చారు. విలక్షణ చిత్రాల దర్శకుడు మాధుర్‌ బండార్కర్‌ హిందీ రీమేక్‌ కోసం మెగాఫోన్‌ పడుతున్నారు. విజయకాంత్‌ హీరోగా ఎ.ఆర్‌.మురగదాస్‌ దర్శకత్వంలో 2002 సంవత్సరంలో విడుదలైన తమిళ చిత్రం 'రమణ' బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు రేకెత్తించింది.

    అదే చిత్రం చిరంజీవి, శ్రియ జంటగా వి.వి.నాయక్‌ దర్శకత్వంలో తెలుగులో 'ఠాగూర్‌'గా విడుదలై రికార్టులు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కానుందనే వార్తలు అంతటా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాధుర్‌ బండార్కర్‌.. ''తమిళ చిత్రం 'రమణ' హిందీ రీమేక్‌ సంబంధించి ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ప్రస్తుతానికి ఇంకేమీ చెప్పలేను'' అని ట్వీటర్‌లో ఇలా రాసుకున్నాడు. అవినీతి ప్రధానాంశంగా 'రమణ', 'ఠాగూర్‌' చిత్రాలు నిర్మితమయ్యాయి. బాలీవుడ్‌ వర్గాలు చెప్పినదాన్ని బట్టి బాలీవుడ్‌ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా బన్సాలీ నిర్మించే హిందీ రీమేక్‌ చిత్రానికి బండార్కర్‌ దర్శకత్వం వహిస్తాడు. అంతేకాక హిందీ రీమేక్‌లో బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌, అందాల తార ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తారని సమాచారం.

    English summary
    "Nothing has been finalised on the hindi remake of the tamil film Ramanna. Its too early to say anything on it!!!," Bhandarkar wrote on twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X