రేప్ కేసులో విముక్తి...స్టార్ దర్శకుడి మొక్కులు
రేప్ కేసులో ఊరట లభించడంతో....బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మధుర్ బండార్కర్ దర్గాలో ప్రత్యక్షమయ్యాడు. ప్రీతి జైన్ రేప్ కేసులో తనపై విచారణ నిలిపి వేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఫుల్ హ్యాపీగా ఉన్న మధుర్ బండ్కార్ దర్గాను దర్శించి మొక్కు తీర్చుకున్నాడు.
ప్రీతిజైన్ అనే మహిళ 2004 జులైలో మధుర్ బండార్కర్ తనపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు చేస్తూ కేసు వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ప్రలోభపెట్టి మధుర్ తనను లొంగదీసుకుని పలుసార్లు అత్యాచారం చేశాడని ప్రీతిజైన్ తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.
మూడు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకున్న మధుర్‌బండార్కర్… వాస్తవ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చాందినీ బార్, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్ చిత్రాలు నిర్మించారు.
ప్రస్తుతం ఈ దర్శకుడు కరీనా ప్రధాన పాత్రలో 'హీరోయిన్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఫ్యాషన్ చిత్రంలో మోడల్స్ జీవితం ఎలా ఉంటుంది అనేది తెరపై అద్భుతంగా ఆవిష్కరించి మధుర్...ఈ చిత్రంలో హీరోయిన్ల తెర వెనక జీవితాన్ని చూపెట్టబోతున్నారు.


Click it and Unblock the Notifications











