క్యాలెండర్ గర్ల్స్ : బికినీ బేబ్స్ కోసం దర్శకుడి వేట
ముంబై: నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తీయడం బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బండార్కర్ స్టైల్. బార్ గర్ల్స్ జీవితంపై 'చాందినీ బార్', మోడలింగ్ రంగంలోని మోడల్స్‌పై 'ఫ్యాషన్', కథానాయికల జీవితంపై 'హీరోయిన్' లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. తాజాగా ఆయన కన్ను క్యాలెండర్ గర్ల్స్‌పై పడింది.
ఈ మధ్య న్యూఇయర్ క్యాలెండర్ల పేరుతో అందమైన భామలకు బికినీ వేయించి ఫోటో షూట్ జరుపడం ఫ్యాషన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాలెండర్ గర్ల్స్ జీవితంపై ఆయన సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్క్రిప్టు కూడా రెడీ చేసుకున్నాడు.

ఈ సినిమాలోని ఆరు ముఖ్యమైన పాత్రల కోసం ఆరుగు యంగ్ గర్ల్స్‌ను ఎంపిక చేసుకున్నాడు. బాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే ఇందుకు సంబంధించిన ఆడిషన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. బికినీలకు పర్ పెక్టుగా సూటయ్యే, ఫ్యాషనబుల్ బాడీ ఉన్న అమ్మాయిలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు సినిమాలకు పరిచయం లేని కొత్త ముఖాలను ఆయన ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మాధుర్ బాండర్క్ సినిమా అనగానే సినిమా రంగంలోకి రావాలని ఆశ పడుతున్న మోడల్స్ ఉత్సాహంగా ఆడిషన్స్‌కు హాజరయ్యారు. వారి నుండి మంచి నటనా చాతుర్యం, సెక్సీ బాడీ ఉన్న వారిని ఎంపిక చేసారు.


Click it and Unblock the Notifications











