twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతలను, డైరెక్టర్లను ఇబ్బంది పెట్టావ్... ప్రకాష్ రాజ్ ఏంది నీ గోల?

    By Bojja Kumar
    |

    ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కొన్ని రోజులుగా జ‌స్ట్ ఆస్కింగ్‌ అనే యాష్ ట్యాగ్ తో వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ ట్యాగ్ తో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్వీట్స్ అన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని టార్గెట్ చేస్తున్న ఉండటం గమనార్హం. సోమవారం గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరోసారి ట్విట్టర్‌కు పని పెట్టారు.

     150 అన్నారు... ఏమైంది?

    150 అన్నారు... ఏమైంది?

    `ప్రియ‌మైన ప్రధాన‌మంత్రిగారూ.. విజ‌యం సాధించినందుకు అభినంద‌న‌లు. కానీ మీరు ఈ ఫలితంతో సంతోషంగా ఉన్నారా? 150 ప్ల‌స్ సీట్లు సాధిస్తామ‌న్నారు క‌దా.. ఏమైంది? ఒక‌సారి పునరాలోచన చేసుకోండి. స‌మ‌స్య‌లు ఎక్క‌డున్నాయో తెలుసుకోండి. విభ‌జ‌న రాజ‌కీయాలు ప‌నిచేయ‌లేదు. గ్రామీణుల‌ను, పేద‌ల‌ను, రైతుల‌ను నిర్ల‌క్ష్యం చేశారు. వారి గొంతు బిగ్గ‌ర‌గా వినిపిస్తోంది.. మీరు వింటున్నారా` అని ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

    ప్రకాష్ రాజ్ మీద మండి పడ్డ మధుర శ్రీధర్ రెడ్డి

    ప్రకాష్ రాజ్ మీద మండి పడ్డ మధుర శ్రీధర్ రెడ్డి

    ప్రకాష్ రాజ్ ట్వీట్ నేపథ్యంలో..... టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి స్పందించారు. ప్రకాష్ రాజ్ తీరుపై మండి పడుతూ ఓ ట్వీట్ చేశారు.

     ప్రకాష్ రాజ్ ఏంది నీ గోల?

    ప్రకాష్ రాజ్ ఏంది నీ గోల?

    ‘ప్రకాష్ రాజ్... అసలు నీ గోల ఏంటో అర్థం కావడం లేదు. నీ అహంకారంతో ఎంతో మంది నిర్మాతలు, డైరెక్టర్లను ఇబ్బంది పెట్టావు కదా. నువ్వు సంతోషంగా ఉన్నావా?' అంటూ మధుర శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

     పబ్లిసిటీ కోసం ట్రై చేయకు

    పబ్లిసిటీ కోసం ట్రై చేయకు

    కేవలం హెడ్ లైన్లలో నిలవాలని ప్రయత్నించకు. నువ్వు ముందు నిజాయితీగా పని చేయ్. నువ్వు ఒక లీడర్ అనే అభిప్రాయం మాలో కలిగించు, ఆ తర్వాత ఎదుటివారి మీద కామెంట్ చెయ్. నీ వ్యాఖ్యలను మేము సీరియస్ గా తీసుకుంటాం' అంటూ శ్రీధర్ ట్వీట్ చేశారు.

    English summary
    "Mr Prakash Raj... Don’t just try to make headlines! Work on a genuine cause & make an impact as leader. Then u comment & we will take u seriously." Madhura Sreedhar Reddy tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X