»   » మధుర శ్రీధర్ కొత్త చిత్రం "నేను సచిన్ కాదు''

మధుర శ్రీధర్ కొత్త చిత్రం "నేను సచిన్ కాదు''

Posted By:
Subscribe to Filmibeat Telugu
Madhura Sreedhar
హైదరాబాద్ : స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ,బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వంటి చిత్రాలను అందించిన దర్శకుడు మధుర శ్రీధర్ తన తదుపని చిత్రం ప్రకటించారు. ఆ చిత్రం టైటిల్ ఐయామ్ నాట్ సచిన్. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథను తన దర్శకత్వంలొ అందిస్తున్నారు. మల్టీడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై ఎమ్.వి.కె.రెడ్డి నిర్మించబోయే ఈ చిత్రం మే నెలలో ప్రారంభం అవుతుంది.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ... ప్రస్తుతం యువతరం ఆదరిస్తున్న 20-20 క్రికెట్ మ్యాచ్ లో అత్యున్నత ప్రదర్శనతో హీరోగా ఎదిగి, డబ్బు మరియు గ్లామర్ పై వ్యామోహంతో బెట్టింగ్ ఊడిలో చిక్కుకుని జీరో అయినన ఓ మధ్య తరగతి కుర్రాడి కథ ఇది. మానవ సంబంధాలతో ప్రేమ, నమ్మకం, నైతిక విలువల ప్రాధాన్యత ను తెలిపే విధంగా ఈ చిత్రం ఉంటుంది. బివిఎస్.ప్రకాష్ రచన చేస్తున్నారు,. ఈ చిత్రం నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాము అన్నారు.

మరో ప్రక్క ఆయన వీర్యదాత పాత్రకు సరిపోయే పర్ ఫెక్ట్ హీరో కోసం ఎదురు చూస్తున్నారు. హిందీలో మంచి విజయం సాధించిన ఆయుష్మాన్ ఖురానా నటించని 'వికీ డోనర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీర్యం దానం చేసే ఓ వ్యక్తి కథ ఈ మూవీ. దాదాపు సంవత్సరం తర్వాత మధుర శ్రీధర్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారు. సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైందని, అయితే కథకు సరిపోయే కథానాయకుడు దొరకడం లేదని అంటున్నాడు మధుర్ శ్రీధర్. త్వరలోనే సబ్జెక్టుకు సూటయ్యే హీరోను వెతికి పట్టుకుంటానంటున్నాడు.

గతంలో ఈచిత్రం కోసం మధుర శ్రీధర్ హీరో నానిని సంప్రదించాడు. అయితే నాని బ్యాండ్ బాజా భారత్, జెండాపై కపిరాజు చిత్రాలతో బిజీగా ఉండటంతో హీరో రానాతో ఈచిత్రం చేయాలనుకున్నాడు. అయితే రానా కూడా రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో బిజీగా ఉండటంతో కుదరదనిచెప్పాడు. ప్రస్తుతం మధుర శ్రీధర్ కన్ను బస్టాప్, నీకు నాకు చిత్రాల హీరో ప్రిన్స్‌పై పడింది. ఈచిత్రం కోసం కొన్ని కిలోల బరువు తగ్గాలని సూచించాడట. అయితే ప్రిన్స్ కూడా ఈ ప్రాజెక్టుకు ఫైనల్ కాలేదని తెలుస్తోంది. దీంతో కొత్త వారితోనే సినిమా చేయాలని నిర్ణయించినట్లు మధుర శ్రీధర్ వెల్లడించారు.

English summary

 Madhura Sreedhar, the director of movies like 'Sneha Geetham', 'It's my love story' and 'Back Bench Student', has got ready to direct a new movie titled "I am not Sachin". "Nenu Sachin Kaadhu" is the tagline of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu