twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మధుర శ్రీధర్ దర్శకత్వంలో నటించాలని ఉందా?

    By Srikanya
    |

    'స్నేహగీతం' చిత్రంతో పరిచయమైన 'మధుర' శ్రీధర్‌రెడ్డి తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. 'ఇట్స్‌ మై లవ్‌స్టోరీ' అనే టైటిల్ తో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇంకా మిగిలి ఉంది. తెలుగు అమ్మాయినే ఎంపిక చేద్దామని శ్రీధర్ ఆలోచనలో ఉన్నారు. అందుకోసం ఆయన ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అమ్మాయిలు తమ ప్రొఫైల్స్‌
    [email protected] అనే వెబ్‌సైట్‌కు ఈనెల 15 వరకు పంపించవచ్చు. ఇక ఈ విషయాలను తెలియపరచటానకి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ...'మేం తలపెట్టిన స్టార్‌హంట్‌కి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.

    దాదాపు ఇప్పటివరకు 3000లకు పైగా దరఖాస్తులు రాగా, అందులో హీరో క్యారెక్టర్‌ కొరకు 12, మిగతా క్యారెక్టర్ల కొరకు 60 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేసాం. ఒక్క హీరోయిన్‌కి తప్ప మిగతా పాత్రలకు చాలా అప్లికేషన్స్‌ వచ్చాయి. ఫ్యాషన్‌ రంగంలో హైదరాబాద్‌ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ స్టార్‌హంట్‌కి తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్‌ చాలా తక్కువలో రావడంతో నిరాశ కలిగించింది. అయినప్పటికీ తెలుగు అమ్మాయిల కోసం అన్వేషిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు అమ్మాయిలూ పాల్గొనవచ్చు అన్నారు.కాబట్టి అమ్మాయిలూ బీ రెడి. ఆ అవకాశం మీకే దక్కచ్చు.

    English summary
    Madhura Sridhar's upcoming flick ‘It’s My Love Story’ is also going to introduce new casting similar to his debut movie 
 
 and is in the process of ‘Star Hunt’ for the same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X