twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీర్య దానం కథాంశంతో మధుర శ్రీధర్... డిటేల్స్

    By Srikanya
    |

    వీర్య దానం కథాంశంతో హిందీలో వచ్చిన విక్కీ డోనర్ హిట్ అవటంతో తెలుగులోనూ అలాంటి కథాంశాలతో సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆ కోవలో మధురా శ్రీధర్ ఓ చిత్రం తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దానకర్ణ, దానకర్ణుడు అనే టైటిల్స్ ని ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లే అవకాశం ఉంది. మరో ప్రక్క హీరో సిద్దార్ద తెలుగు, తమిళంలో విక్కీ డోనర్ చిత్రం చేయటానికి గానూ రైట్స్ తీసుకున్నారు.

    ఇక ఈ విషయమై మధుర శ్రీధర్ ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ... విక్కీ డోనర్ చూసి నేను ప్రేరణ పొందలేదు. పేపర్లో వచ్చిన స్పెర్మ్ డొనేషన్ మీద వచ్చిన ఓ ఆర్టికల్ చదివి కథ రెడీ చేసుకున్నాను. చెన్నైకి చెందిన ఓ జంట ఆన్ లైన్లో ఐఐటి పాస్ అయిన వ్యక్తి వీర్యం కావాలంటూ ప్రకటన ఇచ్చారు. అది చదివిన దగ్గరనుంచి నేను ఆలోచనలో పడి ఆ పాయింట్ మీద సినిమా చెయ్యాలనుకున్నాను. నా సినిమా ఓ ప్రేమ కథ. సరోగెట్ మదర్ కి,స్పెర్మ్ డొనేటర్ కి మధ్య జరుగుతూంటుంది అని వివరించారు. గతంలో మధుర శ్రీధర్... ఇట్స్ మై లవ్ స్టోరీ,స్నేహ గీతం చిత్రాలు డైరక్ట్ చేసారు. భాక్సాఫీస్ వద్ద ఫలితం ప్రక్కన పెడితే ఈ చిత్రాల ద్వారా చాలా మంది కొత్త వాళ్లు పరిశ్రమకు పరిచయమయ్యారు.

    గంగపుత్రులు వంటి ఆఫ్ బీట్ చిత్రాలు కంటిన్యూగా చేస్తున్న సునీల్ కుమార్ రెడ్డి ఈ పరిణాలపై మాట్లాడుతూ... తెలుగులో ఇప్పుడు యువత ఎక్కువగా సినిమాలు చూస్తోంది. అయితే వారి డిమాండ్ మేరకు సినిమాలు రావటం లేదు. వారి ఆలోచనలు,ఆందోళనలు,అబిప్రాయాలు సినిమాల్లో చోటు చేసుకోవటం లేదు. ఎందుకంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ యంగ్ కాకపోవటమే దానకి కారణం. క్లియర్ గా ఓ జనరేషన్ గ్యాప్ మెయిన్ స్టీమ్ సినిమా ల్లో ఉంది. ప్రస్తుతం విక్కీ డోనర్, దోస్తానా,డిల్లీ బెల్లీ,సైతాన్,పీప్లీ లైవ్ వంటి చిత్రాలు తెలుగులో రావాల్సిన అవసరం ఉంది అన్నారు.

    అయితే దర్శకుడు ఆర్పీ పట్నాయిక్ మాత్రం ఈ విషయమై విభేదిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ..మన ఆడియోన్స్ ఐదు పాటలు,ఆరు ఫైట్స్ ఫార్ములా కే హ్యాపీ ఫీలవుతున్నారు. ప్రయోగాత్మకంగా చేసే సినిమాలను వారు తిరస్కరిస్తున్నారు. అంతెందుకు నా ప్రెండ్స్ బుక్ సినిమానే తీసుకోండి. రివ్యూలు సినిమా బాగుందని వచ్చినా...భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రప్పించలేకపోయాయి. టాలీవుడ్ లో నిజమైన మల్టిఫెక్స్ సినిమాలు రావాల్సి ఉంది అన్నారు.

    English summary
    Madhura Sreedhar says "It was about a Chennai-based couple who placed an advertisement online seeking a sperm donor who is an IIT pass out. The report got me thinking and I wanted to make a film that dealt with the issue. My film is the love story of a girl who happens to work as a surrogate mother and a guy who makes his living as a sperm donor. I even registered a couple of titles "Daana Karna" and "Daana Karnudu" for the movie he reveals.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X