ఇంటర్నెట్ లో... ( 'లేడీస్ అండ్ జెంటిమెన్' ప్రివ్యూ)
హైదరాబాద్ : ఇంటర్నెట్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివి ఈ రోజు యూత్ కి నిజ జీవితంలో ఒక భాగమైపోయాయి. వీటితో లాభాలు ఎంత ఉన్నాయో..సరిగ్గా వినియోగించుకోకపోతే నష్టాలు అదే స్ధాయిలో ఉంటున్నాయి. మరి ఇలాంటి కాన్సెప్టు ని చర్చిస్తూ ఓ చిత్రం చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో వస్తున్న సినిమానే ఇది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వాయిస్ ఓవర్‌తో 'లేడీస్ అండ్ జెంటిమెన్' రానున్నది. మానవ సంబంధాలపై ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేస్తున్నది అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఈ రోజు (జనవరి 30) న విడుదల కానుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇంటర్నెట్‌లో ఓ తోడు కోసం వెదికే విద్యార్థి (చైతన్య కృష్ణ), అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకొనే మరో యువకుడు (మహత్), సంతోషం కోసం వెదుక్కొనే గృహిణి (నిఖిత నారాయణ)... ఈ ముగ్గురి కథ ఇది. మూడూ వేర్వేరు కథలే. కానీ వీటిని అనుసంధానం చేసేది మాత్రం ఇంటర్నెట్. అదెలా..? ఈ ముగ్గురి అన్వేషణ ఫలించిందా, లేదా? అనేది తెరపై చూడాలి.

చిత్ర సమర్పకుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ ''అంతర్జాలం మన జీవితాలతో మమేకం అయిపోయింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు దిన చర్యలో భాగం అయిపోయాయి. తల్లిదండ్రులు హాల్‌లో టీవీ చూస్తుంటే.. పిల్లలు బెడ్‌రూమ్‌లో ఇంటర్నెట్‌తో గడుపుతున్న రోజులు. పిల్లలపై పెద్దవాళ్లు ఓ కన్ను వేయాలి. అవసరమైతే వాళ్లని గైడ్ చేయాలి. సరైన దారిలో నడిపించాలని చెప్పే చిత్రం ఇది. సైబర్ నేరాల నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన తొలి చిత్రమిదే. పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ అందించారు. ఈసినిమా చూసి మహేష్ భట్ మెచ్చుకొన్నారు'' అన్నారు.
చిత్రం పేరు: లేడీస్ అండ్ జెంటిల్‌మెన్
సంస్థ: శిరిడీసాయి కంబైన్స్
నటీనటులు: చైతన్య కృష్ణ, మహత్ రాఘవేంద్ర, నిఖితా నారాయణ, అడవిశేష్, జాస్మిన్, స్వాతి దీక్షిత్ తదితరులు
సంగీతం: రఘు కుంచె
ఎడిటింగ్: నవీన్ నూలి.
కెమెరా: జగన్ చావలి,
సహనిర్మాతలు: రాజ్ కందుకూరి.
నిర్మాత: ఎం.వి.కె. రెడ్డి
దర్శకత్వం: పి.బి.మంజునాథ్
విడుదల: 30,జనవరి, 2014.


Click it and Unblock the Notifications











