మన సినిమా అంటే నవ్వుకుంటారు..!
నిర్మాత,దర్శకుడు.మధుర శ్రీధర్ మాట్లాడుతూ తమిళ్ వాళ్ళు,హింది వాళ్ళు మన సినిమా అంటే నవ్వుకుంటారు ఎందుకంటే మాన హీరోలు రంగు రంగుల బట్టలు వెసుకుంటారని మన సినిమాలు ఓవర్ గా ఉంటాయి అని.
Recommended Video

పెళ్లి చూపులు లాంటి సినిమాను రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం 'మెంటల్ మదిలో. శ్రీవిష్ణు, నివేద పేతురాజ్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24 విడుదలైంది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.
నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. తమిళ్,హిందీ వాళ్ళు మన సినిమా అంటే నవ్వుకుంటారు. ఎందుకంటే మన హీరోలు రంగు రంగుల బట్టలు వేసుకుంటారు. మన సినిమాలు ఓవర్గా ఉంటాయి అనే విమర్శ ఉండేది. అందుకు భిన్నంగా మెంటల్ మదిలో సినిమాను చాలా కొత్తగా తీసారు. రాజ్ కందుకూరి కథలను సెలక్ట్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది. పెళ్లి చూపులు సినిమా చూసి ఇప్పుడు చాలా మంది మన గురించే మాట్లాడుకుంటున్నారు.
మెంటల్ మదిలో సినిమాతో అందరు ఇంక మారిపోతారు. అంతే కాదు రాజ్ కందుకూరి ఇలాంటి కొత్త వాళ్ళను కూడా నమ్మి సినిమా ఇవ్వటం చాలా గొప్ప విషయం. అతను నమ్మక పొతే ఇలాంటి ఒక సినిమా ఇలాంటి కొత్త వాళ్ళు మనకు దొరికే వాళ్ళు కాదు. సినిమాకి ఎందుకు ఎక్కువ మార్కెటింగ్ చెయ్యలేదో కారణాలు విశ్లేషించారు.


Click it and Unblock the Notifications











