twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మధురం’...ఒక విషం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సూర్య డిజిటల్స్ సమర్పణలో సూర్య పవర్ ఫుల్ మూవీస్ పతాకంపై గతంలో నాలుగు చిత్రాలను అందించి తాజాగా తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు 'మధురం' పేరుతో అందిస్తున్నారు. వి. సురేష్ చౌదరి, బి. భాస్కర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

    ఈ సందర్బంగా చిత్ర నిర్మాత వి. సురేష్ చౌదరి మాట్లాడుతూ...'తమిళంలో మంచి విజయం సాధించిన 'తిరుమది సుజ అండ్ కాదలి' పేరుతో విడుదలైన చిత్రాన్నితెలుగులో 'మధురం' పేరుతో విడుదల చేస్తున్నాం. ఒక విషయం అనేది ఈచిత్రం ట్యాగ్ లైన్ అన్నారు.

    కథ గురించి వివరిస్తూ...ఒక ఫ్యాక్టరీ నడిపే వ్యక్తి కొంత మంది పని వాళ్లకు తన ఇంటిలో షెల్టర్ ఇస్తాడు. దాని వల్ల అనుకోని పరిస్థితులలో ఓనర్ భార్య ఒక వర్కర్ మధ్య జరిగే ప్రేమ, దీని పర్యవసానాలు ఏమిటన్నదే ఈచిత్ర కథ. ఇందులో చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో సెల్వన్ మాధవన్, సునిత, సిబా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

    క్వాలిటీ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నాం. డబ్బింగ్ జరుగుతోంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్ మూడవ వారంలో రిలీజ్ చేస్తాం. ఇందులో సునిత గ్లామర్ హైలెట్ నిలుస్తుంది. మా బేనర్ నుంచి వస్తున్న 5వ సినిమా ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : హరిణి, ఫోటో గ్రఫీ : సుమి, నిర్మాతలు : వి.సురేష్ చౌదరి, బి. భాస్కర్ రావు, దర్శకత్వం : ఆర్ముగం.

    English summary
    Tamil movie 'Tirumadi Suza and Kadali' release in telugu as Madhuram. Surya Power full movie produce this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X