వివాదంలో మాధురి ఆజా నాచ్ లే!!
చానాళ్ల తరువాత మాధురీ దీక్షిత్ నటించిన సినిమా ఆజా నాచ్ లే. ఇపుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని ఒక పాట దళితులను కించపరిచేలా ఉందని అపుడే నిరసనలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా నిషేదించాలని కోరుతూ అపుడే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ప్రధానికి లేఖ కూడా రాసింది. ఉత్తరప్రదేశ్ లో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. పంజాబ్ లోనూ నిషేదిత ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీలోను చిత్రం ప్రదర్శితమవుతున్న పివిఆర్ ప్లాజా థియేటర్ ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ మెహతా, దళితులను కించపరిచే విధంగా ఉన్న ఒక పాటలోని పదాన్ని తొలగించాల్సిందిగా ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ ను కోరినట్టు ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











