మాధురి దీక్షిత్‌కు బెదిరింపులు, భయం గప్పిట్లో బాలీవుడ్!
హైదరాబాద్: ఒకప్పటి స్టార్ హీరోయిన్, బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌ను డబ్బు కోసం బెదింపులకు పాల్పడిన ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలానికి దారి తీసింది. ఈ సంఘటనతో మళ్లీ బాలీవుడ్ పరిశ్రమపై అండర్ వరల్డ్ మాఫియా కన్నుపడినట్లు స్పష్టమవుతోంది. దీంతో పలువురు బాలీవుడ్ స్టార్స్ ఆందోళనకు గురవుతున్నారు.
తాము అడిగిన డబ్బు తమ అకౌంట్‌కు బదిలీ చేయకపోతే మీ పిల్లలను చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. ప్రవీణ్ కుమార్ ప్రధాన్ అనే వ్యక్తి నుండి ఈ మెసేజ్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసారు. అతను ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు.

ప్రవీణ్ కుమార్ ప్రధాన్...ముంబై మాఫియా డాన్ చోటా రాజన్ గ్యాంగుకు చెందిన వాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనతో ముంబైలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మళ్లీ ముంబైలో మాఫియా కార్యకలాపాలు విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా....మాధురి దీక్షిత్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసారు.


Click it and Unblock the Notifications











