For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పీకల్లోతు కష్టాల్లో టెలివిజన్ నటి.. లక్షల రూపాయల చెక్ ఇచ్చిన మాధురీ దీక్షిత్

  |

  హిందీ టెలివిజన్ రంగంలో మూడు దశాబ్దాలకుపైగా ప్రధాన పాత్రలతో ప్రేక్షకులను ఆకర్షించిన షాగుఫ్తా ఆలీ కటిక దరిద్రంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం జాతీయ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. తన తల్లి, కుటుంబ సభ్యుల కోసం ఆస్తులు, కార్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాను. ప్రస్తుతం అమ్ముకొని తినడానికి ఎలాంటి ఆస్తులు లేవు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా తీవ్రమైన ఆర్థిక సమస్యలో ఉన్న షాగుఫ్తాను వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు సెలబ్రిటీలు ఆమెను ఆదుకొనేందుకు ప్రయత్నించారు. జాతీయ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారం అయ్యే డ్యాన్స్ దీవానే షోలో ఆమెకు ఆర్థికంగా అండ దొరికింది.

  డ్యాన్స్ దీవానే 3 టీమ్ స్పందించి..

  డ్యాన్స్ దీవానే 3 టీమ్ స్పందించి..

  డ్యాన్స్ దీవానే 3 సీజన్‌కు న్యాయనిర్ణేతలుగా హిందీ స్టార్ హీరో, హీరోయిన్లు మాధురీ దీక్షిత్, అనిల్ కపూర్ వ్యవహరిస్తు్నారు. ఈ సందర్భంగా షాగుఫ్తా అలీని వేదికపైకి పిలిచి మాట్లాడించారు. హోస్ట్‌లు ఆమెతో మాట్లాడుతూ మీ కష్టాలను విని దు:ఖించాం అని అన్నారు.

  తీవ్ర అనారోగ్యంతో కష్టాలు

  తీవ్ర అనారోగ్యంతో కష్టాలు

  దాంతో ఎమోషనల్ అయిన షగుఫ్తా ఆలీ మాట్లాడుతూ.. దాదాపు 25 ఏళ్ల కెరీర్ బ్రహ్మండంగా సాగింది. నా కుటుంబాన్ని, నన్ను నేను సంరక్షించుకొన్నాను. కానీ గత నాలుగేళ్ల నుంచి రకరకాల ఆడిషన్స్‌కు వెళ్లాను కానీ వర్కవుట్ కాలేదు. దాంతో డయాబెటీస్ కారణంగా నా ఆరోగ్యం క్షీణించింది. కాళ్లు చచ్చుపడేంత ప్రమాదం ముంచుకొచ్చింది. అలాగే నా కంటిచూపు కూడా మందగించింది అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

  పొంగుకొచ్చిన దు:ఖాన్ని ఆపుకొంటూ

  పొంగుకొచ్చిన దు:ఖాన్ని ఆపుకొంటూ

  ఆ తర్వాత పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకొంటూ.. ఈ ఇండస్ట్రీ నాకు సొంత ఇల్లు లాంటింది అని కన్నీళ్లను తడుచుకోవడంతో పక్కనే ఉన్న హోస్ట్, కమెడియన్ భారతీ సింగ్ ఆమెను కౌగిలించుకొని ఓదార్చారు. అంతలోనే వేదికపై న్యాయమూర్తి స్థానంలో ఉన్న మాధురి దీక్షిత్ చేతిలో చెక్కు పట్టుకొని నడుచుకొంటూ వచ్చి ఆమెను ఓదార్చారు.

  ఐదు లక్షల రూపాయల చెక్

  ఐదు లక్షల రూపాయల చెక్

  అనంతరం షగుఫ్తా అలీని ఓదార్చుతూ.. ఇక మీరు అమ్ముకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవని విన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోవడానికి డ్యాన్స్ దీవానే టీమ్ నిర్ణయం తీసుకొన్నది. ఈ టీమ్ తరఫు నుంచి మీకు రూ.5 లక్షలు అందిస్తున్నాం అంటూ మాధురీ దీక్షిత్ ఎమోషనల్ అయ్యారు. దాంతో షగుఫ్తా ఆలీ కూడా కంటతడి పెట్టుకొంటూ మీరు చేసిన సహాయానికి నాకు మాటలు రావడం లేదు అని అన్నారు. మాధురీ దీక్షిత్ కౌగిలించుకొని ఆమెకు భరోసాను ఇచ్చారు.

  Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
  ఎవరి నుంచి సహాయం అందలేదు అంటూ

  ఎవరి నుంచి సహాయం అందలేదు అంటూ

  ఇదిలా ఉండగా, షగుఫ్తా ఆలీ మాట్లాడుతూ... సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (సింటా) నన్ను సంప్రదించింది. కానీ వారి నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి సహాయం అందలేదు. వారి వద్ద తగినంత నిధులు లేకపోవడం వల్ల నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎవరి నుంచి కూడా సహాయం అందలేదు అంటూ మీడియాకు వెల్లడించారు

  English summary
  Madhuri Dixit helps 5 lakhs cheque to Shagufta Ali on behalf of Dance Deewane 3 season. Actress Shagufta Ali facing hard time and looking for financial help. Earlier she suffered with cancer and now she is facing hard time with diabetes. She sold her assets and car to fill her financial troubles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X