'ఆజా నాచలే' చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మాధురీ దీక్షిత్ కి ఆ రీ ఎంట్రీ కలసి రాలేదు. దాంతో సైలంట్ ఉన్నామె ప్రస్తుతం గుల్జార్ కూతురు మేఘనా గుల్జార్ సినిమాలో నటించటానికి పచ్చ జెండా ఊపింది. అది ఓ సెక్స్ కామిడీ అని తెలుసోంది. '36-24-36' టైటిల్ తో రానున్న ఈ సినిమా ధియోటర్లను నవ్వులతో ముంచుతుందని నమ్ముతున్నారు. ఇక మేఘనా గతంలో టబు, సుస్మితాసేన్ లతో 'ఫిల్హాల్' సినిమా రూపొందించి పేరు సంపాదించిందామె. ప్రస్తుతం అమితాబ్ తో టూర్ ఉన్న మాధురి ఈ కథ విని పడిపడి నవ్వి ఓ.కె చేసిందిట. కామిడీగా నవ్వించటం తనికి కొత్త అని అయినా మేఘనా పై నమ్మకంతో ప్రాజెక్ట్ కు ఒప్పుకున్నట్లు చెబుతోంది మాధురి. ఈ సారన్నా హిట్ కావాలని కోరుకుందాం.