ఆన్ లైన్ లో మాధురీ దీక్షిత్ డాన్స్ పాఠాలు.. వివరాలు
ముంబై: మాధురి దీక్షిత్ కి మాజి అవటం అనేది లేనట్లుంది. చేతిలో రెండు సినిమాలు, ఒక రియాల్టీ షో, కమర్షియల్ యాడ్స్ తో క్షణం తీరిక లేకుండా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్.. నాట్యం నేర్చుకోవాలని ఆశించే వారి కోసం ఆన్‌లైన్ వేదికగా కొంగొత్త ఆన్‌లైన్ డ్యాన్స్ అకాడమీని నెలకొల్పాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు ఆమె ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ ని తెరిచింది. ఆ వెబ్ సైట్ పేరు... Dance with Madhuri.
''ప్రస్తుతం 'దేడ్ ఇష్కియా', 'గులాబ్ గ్యాంగ్' చిత్రాల్లో నటిస్తున్నాను. 'ఝలక్ దిఖ్‌లా జా' చిత్రానికి సంతకం చేశాను. ఆన్‌లైన్ డ్యాన్స్ అకాడమీ నెలకొల్పాలనుకుంటున్నాను. దీంతో నాకు కాస్త వెసులుబాటు దొరుకుతుంది'' అని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాధురీ చెప్పారు. 'డ్యాన్స్ విత్ అకాడమీ' పేరిట ఆన్‌లైన్ డ్యాన్స్ అకాడమీని ఆమె ఇటీవల ప్రకటించారు. ఈ అకాడమీ ద్వారా సినీ నాట్యకారిణి నుంచి నృత్య మెళకువలను ఎవరైనా నేర్చుకోవచ్చు.
''నాట్యం పట్ల నాకున్న వ్యామోహం దీనికి పురిగొల్పింది. నాట్యమంటే నాకెంతో ఇష్టం. నాకు మూడు సంవత్సరాల వయస్సు నుంచి నృత్యం చేస్తున్నాను. డ్యాన్స్ పట్ల వ్యామోహాన్ని ఇంటింటికి చేర్చాలనుకుంటున్నాను'' అని ఆమె వివరించింది. ఇక బుల్లితెరలో కలర్స్ రియాల్టీ డ్యాన్స్ షో 'ఝలక్ దిఖ్ లా జా లో ఒక జడ్జిగా మాధురీ దీక్షిత్ ఉన్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఇంతకూ అలా జడ్జిగా వ్యవహరించినందుకు మాధురీకి చెల్లించే పైకం రోజుకు కోటిరూపాయలని సమాచారం. వారంలో రెండు సార్లు అంటే వీకెండ్స్‌లో ఈ షో ప్రసారమవ్ఞతుంది. ఇప్పటికి మూడునెలల నుంచిఈ షో ప్రసారమవుతోంది.
ఆ పెళ్లయ్యాక ఆమె బాలీవుడ్ కి తిరిగిరాలేదు. ఆమె చివరి చిత్రం 'ఆజానాచ్‌లే (2007) ఫ్లాప్. అయినా ఆమె స్టార్ ఇమేజ్ మాసిపోలేదు. ఇప్పటికీ ఆమె బిటౌన్ ఎ-లిస్టర్స్‌లో పరిగణింపబడుతోంది. నిర్మాత కరణ్ జోహార్, కొరియోగ్రాఫర్ రెమో డి సౌజా కూడా ఆ షోలో జడ్జిలుగా ఉన్నారు. ఇప్పుడు మాధురీ చేస్తోంది ఐదో సీజన్. నాలుగో సీజన్‌నుంచి ఆమె పనిచేస్తోంది. ఆమె పారితోషికం చాలా ఎక్కువకదా అంటే కలర్స్ ఛానెల్ అధికారి ఒకరు బదులిస్తూ, '' అమె అగ్రశ్రేణి తారల లీగ్‌లో ఉంది. కాబట్టి ప్రతి ఎపిసోడ్‌కి ఆమె కోటి రూపాయలు అందుకుంటోంది అన్నారు. ఈ సీజన్‌లో ఆమె తరచు స్టేజీ మీదకు వచ్చి, సల్మాన్‌ఖాన్ వంటి గెస్ట్‌లతో కాళ్లు కలిపి డ్యాన్స్ చేస్తోంది కూడా.


Click it and Unblock the Notifications












