రణబీర్‌తో మాధురి దీక్షిత్ ఐటం సాంగ్ కేక...(వీడియో)

మాధురి దీక్షిత్ 46వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ ఐటం సాంగును విడుదల చేసారు. ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ కంపోజ్ చేసిన ఈ సాంగుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ చరిత్రలో మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మాధురి ఈ సాంగులో మరింత హాటుగా కనిపించింది.
రణబీర్ కపూర్ మాధురికి పెద్ద ఫ్యాన్. దర్శకుడు కరణ్ జోహార్ ఐడిమా మేరకు ఆమెతో ఈ సినిమాలో ఐటం సాంగ్ ప్లాన్ చేసారు. చిన్నతనంలో మాధురి దీక్షిత్ సినిమాలు చూసి ఆమెపై అప్పట్లోనే మనసు పారేసుకున్న రణబీర్ కపూర్....ఇప్పుడు ఆమెతో కలిసి నటించే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అంతే కాదండోయ్....దర్శకుడికి లంచం ఇచ్చి మరీ ఇందులో ఆమె బుగ్గపై ముద్దు పెట్టే సన్నివేశానికి ప్లాన్ చేసాడట. ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా వెల్లడించారు.
(ఇక్కడ క్లిక్ చేసి వీడియో సాంగును వీక్షించండి)


Click it and Unblock the Notifications











