భర్తతో సంతోషంగా లేని స్టార్ హీరోయిన్?
మాధురి దీక్షిత్. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్. కొన్ని సంవత్సరాల పాటు బాలీవుడ్ తెరపై ఏక ఛత్రాధిపత్యం కొనసాగించిన తార. అమెరికాలో సెటిల్ అయిన రిచ్ డాక్టర్ తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మాధురి ఆ తర్వాత అమెరికాలోనే సెటిల్ అయింది. భర్త శ్రీరామ్ తో అక్కడే ఉంటూ, పూర్తిగా ఇంటి బాధ్యతలకే పరిమితం అయింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు అబ్బాయిలు అరిన్ మరియు ర్యాన్.
భారతీయ అభిమానులకు దూరమై దాదాపు పదేళ్ల పాటు అమెరికాలోనే గడిపిన మాధురి ఆ మధ్య సడెన్ గా ఇండియాలో అడుగు పెట్టింది. ఓ సినిమాలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం వాణిజ్య ప్రకటనలతో బీజీగా ఉంది. మేమంతా మళ్లీ ఇండియాలో సెటిల్ అవ్వడానికి వస్తున్నాం అంటూ ఆ మధ్య ట్విట్టర్ లో పేర్కొన్న మధురి, ఇంత వరకు కుంటుంబంతో సహా ఇండియాకు షిప్టు కాలేదు. అయితే విశ్వ సనీయంగా అందినసమాచారం ప్రకారం మాధురికి, ఆమె భర్త శ్రీరామ్ మధ్య ప్రస్తుతం సఖ్యత లేదని తెలుస్తోంది. త్వరలోనే వాళ్ల బంధం విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











