అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభిమానుల చెంతకు..!
ముంబై: బాలీవుడ్‌లో కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించడానికి అమెరికా నుండి తిరిగి వచ్చిన అలనాటి అందగత్తె మాధురి దీక్షిత్ పేరు మీద అధికారకంగా వెబ్‌సైట్ ని విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ విషయంపై మాధురి దీక్షిత్ తన మైక్రో బ్లాగింగి వెబ్‌సైట్ ట్విట్టర్ ఎకౌంట్‌లో www.madhuridixit-nene.com పేరు మీద ఉన్న వెబ్‌సైట్ కొన్నిరోజుల్లో అందుబాటులోకి రానుందని.. ఈ సైట్ ద్వారా అభిమానులు నాతో మాట్లాడోచ్చు. మీ అభిప్రాయాల కోసం ఎదురుచూస్తుంటానని పేర్కోన్నారు.
ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యగానే నల్లని దుస్తులు ధరించిన మాధురి చిత్రం కనిపిస్తుంది. ఈ వెబ్‌సైట్ అధికారకంగా మాధురి దీక్షితేనని అభిమానులకు తెలియజేసేందుకే ఈ ఫోటోను పెట్టామని తెలిపింది. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, గుల్ పనాగ్ తదితరుల పేరిట అధికారిక వెబ్‌సైట్స్ ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో "తేజాబ్", "రాం లఖన్", "సాజన్", "బీటా", "దిల్", "హమ్ ఆప్కే హైన్ కౌన్!", "దిల్ తో పాగల్ హై"లతో పాటు"దేవదాస్" లాంటి బ్రహ్మాండమైన బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించిన మాధురి 2002లవ సంవత్సరంలో అమెరికాకు చెందిన డాక్టర్ 'శ్రీరామ్ మాధవ్ నేనే'ని వివాహా మాడి అమెరికా వెళ్లి పోయింది.
వివాహాం తర్వాత బాలీవుడ్‌కు వచ్చి'ఆజా నాచలే' సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన మాధురి సక్సెస్‌ని సాధించ లేక పోయింది. ఐతే 'ఝలక్ దిఖ్లా జా 4ట' డాన్స్ రియాలిటీ షో జడ్జిగా వ్యవహారించడం ద్వారా తన అభిమానులకు మరింత దగ్గరవ్వడంతో మళ్లీ సినిమాలలో నటించాలని అనుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











