twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరీష్ చిత్రంలో చిరంజీవి పాట రీమిక్స్

    By Srikanya
    |

    Madhurima to dance for Silk Smitha number
    హైదరాబాద్ : చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలంతా ఆయన సూపర్ హిట్ చిత్రాలలోని పాటలను రీమిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు. తాజాగా అల్లు శిరీష్ ఆ పనిలో పడ్డారు. మారుతి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా ఆయన ఇప్పుడు 'కొత్త జంట' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది. ఇప్పుడు మధురిమ ఈ పాటకు చిందుకు వేయనుంది. సారధి స్టూడియోస్ లో గణేష్ మాస్టార్ సారధ్యంలో ఈ పాట తెరకెక్కుతోంది.

    'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మారుతి. 'బస్‌స్టాప్‌', 'ప్రేమ కథాచిత్రమ్‌' సినిమాలు విజయాల్ని సాధించాయి. ప్రస్తుతం అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న 'కొత్త జంట' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా అంటున్నారు దర్శక,నిర్మాత మారుతి.

    కొత్త జంట గురించి చెప్తూ....ఇప్పుడు నేను చేస్తున్న 'కొత్త జంట' చాలా క్లీన్ ఫిల్మ్. ధూమపానం, మద్యపానానికి సంబంధించిన చిన్న సన్నివేశమే కాదు, కనీసం వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా సినిమాలో కనిపించవు. కానీ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమా. ఆగస్ట్ 2న షూటింగ్ ప్రారంభించాం. గీతా ఆర్ట్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ఎవరం మొనగాళ్లం కాదు. మనలో ప్లస్‌లతో పాటు మైనస్‌లూ ఉంటాయి అన్నారు.

    తదుపరి చిత్రాలు గురించి చెప్తూ.. డి.వి.వి. దానయ్య, బన్నీ వాసు, బెల్లంకొండ సురేశ్, డి.వి.వి. దానయ్య, 'జులాయి' నిర్మాత రాధాకృష్ణ, దిల్ రాజు బేనర్‌లలో చేసేందుకు ఒప్పుకున్నా. అడ్వాన్సులు కూడా తీసుకున్నా. వీటితో పాటు మా గుడ్‌సినిమా గ్రూప్‌కీ ఓ సినిమా చేయాల్సి ఉంది. 'ప్రేమ కథా చిత్రమ్'ను బాలీవుడ్‌లో డైరెక్ట్ చేయమని అడుగుతున్నారు. జి. ఆదిశేషగిరిరావు, యుటీవీ బేనర్ సంయుక్తంగా ఆ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటి తో పాటు నా నిర్మాణ భాగస్వామ్యంలో 'లవ్ యు బంగా రం', 'గ్రీన్‌సిగ్నల్', 'లవర్స్' సినిమాలు రాబోతున్నాయి అన్నారు.

    ఇక మారుతి ఫలానా సినిమాలు మాత్రమే తీస్తాడన్న బ్రాండ్‌ నాకొద్దు. అందుకే ఎప్పటి కప్పుడు కథలు మార్చుకొంటూ సినిమాలు తీస్తున్నా. 'కొత్త జంట' అలాంటిదే. ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకొంటే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ. ''. ''ఆఫీసు బాయ్‌గా పనిచేశా. నెంబర్‌ ప్లేట్లు రాశా. ఇప్పుడు వందమందికి పని కల్పించే స్థితికి చేరుకొన్నా. ఇదంతా నాకు సినిమానే ఇచ్చింది'' అంటున్నారు మారుతి.

    English summary
    Madhurima will dance for a number to which Silk Smitha danced. The song Atu Amalapuram Itu Peddapuram is from Chiranjeevi's hit film Khaidi No 786. This remix number will be used in the film Kotha Janta starring Allu Sirish. This is his second film. Presently the song is being shot in Saradhi Studios under the choreography of Ganesh master. Kotha Janta is directed by Maruthi. Allu Sirish has been paired with Regina in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X