అందాలతో మత్తెక్కిస్తున్న మధురిమ..(హాట్ ఫోటోలు)
హైదరాబాద్: 'ఆ..ఒక్కడు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన మధురిమ ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సరదాగా కాసేపు' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన 'మహంకాళి', వెంకటేష్ హీరోగా వచ్చిన 'షాడో' చిత్రంలో శ్రీకాంత్ సరసన అవకాశం దక్కించుకున్నా ఆ సినిమా ఫట్ మనడంతో అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు.
ప్రస్తుతం అవకాశాల కోసం పడిగాపులు కాస్తున్న భామల లిస్టులో మధురిమ కూడా చేరి పోయింది. ఆకట్టుకునే అందం, విచ్చలవిడిగా అందాలు ఆరబోసే తెగువ, నటనలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ పాపం మధురిమకు కాలం కలిసి రాలేదనే చెప్పాలి. పరిశ్రమలో కొత్త భామల తాకిడి పెరిగి పోవడం కూడా...మధురిమ లాంటి వారికి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణమవుతోంది.
అయితే తన ఉనికిని కాపాడుకోవడానికి హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో లైమ్ లైట్లో ఉండే ప్రయత్నం చేస్తోంది మధురిమ. మధురిమ హాట్ ఫోటోలు చూస్తూ, ఆమెకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం...

మధురిమ
మధురిమ పూర్తి పేరు మధురిమ బెజనర్జీ. 1987 మే 14న ముంబైలో జన్మించింది. హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిర్, గజల్‌తో పాటు కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకున్న మధురిమ టీవీ సీరియల్ష్ ద్వారా తన కెరీర్ మొదలు పెట్టింది. కొన్ని టీవీ ఛానల్స్‌లో యాంకర్‌గా పార్ట్ టైం జాబ్ చేసింది.

సినిమాల్లోకి..
పలు టీవీ సీరియళ్లలో నటించిన అనంతరం ‘టాస్ : ఎ ప్లిప్ ఆఫ్ డెస్టినీ' అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరంగ్రేటం చేసిన మధురిమ....ఆ వెంటనే తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ హీరోగా పరియమైన ‘ఆ ఒక్కడు' చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో నటించిన సినిమాలు
మధురిమ ఇప్పటి వరకు పలు తెలుగు సినిమాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఆ ఒక్కడు, మౌన రాగం, సరదాగా కాసేపు, ఆరెంజ్, మహంకాళి, షాడో చిత్రాల్లో మధురిమ నటించింది.

హిందీలో...
టాస్ అనే హిందీ చిత్రంతో 2009లో తన సినీ కెరీర్ ప్రారంభించిన మధురిమ...పలు తెలుగు సినిమాల్లో నటించిన అనంతరం 2012లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘కమాల్ ధమాల్ మాలామాల్' అనే చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫట్ మనడంతో మధురిమ బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి.

తమిళ, మళయాల చిత్రాల్లో...
హిందీ, తెలుగు సినీ పరిశ్రమల్లో అవకాశాలు లేక పోవడంతో తన దృష్టిని తమిళ, మళయాల చిత్ర సీమల వైపు మళ్లించింది మధురిమ. ప్రస్తుతం ఆమె Eepeeko అనే తమిళ చిత్రంలో, బ్లాక్ కాఫీ అనే మళయాల చిత్రంలో నటిస్తోంది.

కుటుంబ నేపథ్యం
మధురిమ తండ్రి ఇండియన్ నేవీలో మెకానికల్ ఇంజనీర్‌గా సేవలు అందించారు. ఆమె తల్లి వైరాలజీలో రీసెర్చ్ విభాగంలో, కంటెంట్ రైటర్‌గా పని చేసి నావెలిస్టుగా మారారు.

మధురిమ
మధురిమ న్యాయ శాస్త్రంలో డిగ్రీ చేసింది. చదువు పూర్తయిన వెంటనే సినిమా రంగం వైపు దృష్టి సారించింది. ఆమెకు తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన సోదరుడు ఉన్నారు.

సంగీతం, డాన్స్
మధురిమకు చినతనం నుండి సంగీతం, డాన్స్ అంటే ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తి కారణంగానే తన తల్లి నుంచి ఆమె హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు, గజల్ నేర్చుకుంది. ఆ తర్వాత కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది కానీ....తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా మధ్యలోనే ఆపేసింది.

హాట్ ఫోటో షూట్లు
సినిమా అవకాశాలు లేక పోయినా....తన ఉనికిని కాపాడుకోవడానికి హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో లైమ్ లైట్లో ఉండే ప్రయత్నం చేస్తోంది మధురిమ.


Click it and Unblock the Notifications











