For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాధురిమ చాలా హాట్ గురూ..! (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: హాట్ అండ్ సెక్సీ అందాలు, ఆకట్టుకునే అభినయం హీరోయిన్ మధురిమ సొంతం. 2009లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ భామ...ఇన్నేళ్లయిన ఆశించిన స్థాయిలో ఎదగలేదు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించిన మధురిమ త్వరలో ‘క్లోజ్ ఫ్రెండ్స్' సినిమా ద్వారా మరసారి తన అదృష్టం పరీక్షించుకోబోతోంది.

  మధురిమ పూర్తి పేరు మధురిమ బెజనర్జీ. 1987 మే 14న ముంబైలో జన్మించింది. హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిర్, గజల్‌తో పాటు కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకున్న మధురిమ టీవీ సీరియల్ష్ ద్వారా తన కెరీర్ మొదలు పెట్టింది. కొన్ని టీవీ ఛానల్స్‌లో యాంకర్‌‌గా పార్ట్ టైం జాబ్ చేసింది.

  పలు టీవీ సీరియళ్లలో నటించిన అనంతరం ‘టాస్ : ఎ ప్లిప్ ఆఫ్ డెస్టినీ' అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరంగ్రేటం చేసిన మధురిమ....ఆ వెంటనే తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ హీరోగా పరియమైన ‘ఆ ఒక్కడు' చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

  మధురిమ ఇప్పటి వరకు పలు తెలుగు సినిమాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఆ ఒక్కడు, మౌన రాగం, సరదాగా కాసేపు, ఆరెంజ్, మహంకాళి, షాడో, వేట, కొత్త జంట, టెంపర్ చిత్రాల్లో మధురిమ నటించింది. టాస్ అనే హిందీ చిత్రంతో 2009లో తన సినీ కెరీర్ ప్రారంభించిన మధురిమ...పలు తెలుగు సినిమాల్లో నటించిన అనంతరం 2012లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘కమాల్ ధమాల్ మాలామాల్' అనే చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫట్ మనడంతో మధురిమ బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి.

  మధురిమ తండ్రి ఇండియన్ నేవీలో మెకానికల్ ఇంజనీర్‌గా సేవలు అందించారు. ఆమె తల్లి వైరాలజీలో రీసెర్చ్ విభాగంలో, కంటెంట్ రైటర్‌గా పని చేసి నావెలిస్టుగా మారారు. మధురిమ న్యాయ శాస్త్రంలో డిగ్రీ చేసింది. చదువు పూర్తయిన వెంటనే సినిమా రంగం వైపు దృష్టి సారించింది. ఆమెకు తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన సోదరుడు ఉన్నారు.

  మధురిమకు చినతనం నుండి సంగీతం, డాన్స్ అంటే ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తి కారణంగానే తన తల్లి నుంచి ఆమె హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు, గజల్‌ నేర్చుకుంది. ఆ తర్వాత కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది కానీ....తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా మధ్యలోనే ఆపేసింది.

  మధు రిమ నటిస్తున్న క్లోజ్ ఫ్రెండ్స్ చిత్రానికి సంబంధించిన విషయాలు, ఆ సినిమా ప్రమోసన్లో భాగంగా విడుదల చేసిన మధురి హాట్ అండ్ సెక్సీ ఫోటోలు స్లైడ్ షోలో...

  క్లోజ్ ఫ్రెండ్స్

  క్లోజ్ ఫ్రెండ్స్


  విభిన్న‌మైన కాన్సెప్ట్ ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ లో చిన్న చిత్రాలు తీసి పెద్ద విజ‌యాలు సాధిస్తున్న మారుతి టీం వ‌ర్క్స్ ప్రోడ‌క్ష‌న్ లో సినిమా ల‌వ‌ర్స్ సిన‌మా బ్యాన‌ర్ లో మ‌రో వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో సిద్ద‌మైన చిత్రం 'క్లోజ్‌ఫ్రెండ్స్'. ఉర్వ‌శి ధియోట‌ర్స్ అసోసియోష‌న్ తో ఈ చిత్రం చేస్తున్నారు.

  నటీనటులు

  నటీనటులు


  నందు, మ‌ధు నంద‌న్‌, అభిషెక్ మ‌హ‌ర్షి, న‌వీద్ , మ‌ధురిమ‌, కేషా . క్రాతి, షామిలి, భార్గ‌వి లు జంట‌లుగా న‌టిస్తున్నారు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాత‌గా అరుణ్ ప‌వ‌ర్ ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈరోజుల్లో, బ‌స్టాప్, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్‌, కొత్త‌జంట‌, ల‌వ‌ర్స్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన జీవ‌న్ బాబు(జె.బి) సంగీతాన్ని అందిస్తున్నారు.

  ఏప్రిల్ 22న ఆడియో

  ఏప్రిల్ 22న ఆడియో


  ఇటీవ‌లే విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ నెట్ లో సంచ‌లనాన్ని క్రియోట్ చేయ‌టంతో యూనిట్ స‌భ్యులు సంతోషంతో వున్నారు. ఇప్ప‌డు జె.బి అందిచిన ఆడియో ఏప్రిల్ 22న వైవిద్యంగా ఈ చిత్ర ఆడియో ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. అన్ని కార్యక్ర‌మాలు పూర్తిచేసి మే లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తారు.

  నిర్మాత

  నిర్మాత


  ఈ సంద‌ర్బంగా నిర్మాత కుమార్ అన్నంరెడ్డి మాట్లాడుతూ'మారుతి టీంవ‌ర్క్స్ తో అనుభందంగా మా బ్యాన‌ర్ సినిమా ల‌వ‌ర్స్ సినిమా పై ఖ‌ర్చుకు ఏమాత్ర వెన‌కాడ‌కుండా మా ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వ‌ర్ చెప్పిన క‌థ న‌చ్చి ఈ చిత్రాన్ని చేశాము. ద‌ర్శ‌కుడు పూర్తి వినోదాత్మ‌కంగా ఈచిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇటీవ‌లే ర‌ష్ చూశాం పూర్తిగా అంద‌రూ న‌వ్వుతూనే వున్నాము. న‌వ్విస్తూనే చ‌క్క‌టి క్లైమాక్స్ ని అందిచాడు. అన్నారు.

  సమ్మర్ విడుదల

  సమ్మర్ విడుదల


  ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది. న‌లుగురు అబ్బాయిలు, న‌లుగురు అమ్మాయిలు జీవితాల్లో మ‌రో కొంత‌మంది ఎంట‌ర‌య్యి వారి జీవితాల్ని ఎలా మార్చారు చివ‌ర‌కి ఏమ‌య్యింది అనేది చిత్రం. సెకండాఫ్‌లో స‌ప్త‌గిరి వచ్చి చేసే కామెడి కి ధియోట‌ర్ మెత్తం విజిల్స్ ప‌డ‌తాయి, ఈ చిత్రానికి సూప‌ర్‌డూప‌ర్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు జె.బి సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియో ని ఏప్రిల్ 22 న విడుదల చేస్తున్నాము. చిత్రాన్ని ఈ స‌మ్మ‌ర్ లోనే విడుద‌ల చేస్తాము.'అని అన్నారు

  దర్శకుడు

  దర్శకుడు


  ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వ‌ర్ మాట్లాడుతు.. మారుతి గారికి ఈ క‌థ చెప్పాను, క‌థ కంటే క‌థ‌నం చాలా బాగుంద‌న్నారు. నిర్మాత కుమార్ గారికి చెప్పి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న చిత్రాల రాజ‌మౌళి మారుతి గారు నాలాంటి కొత్త వారికి అవ‌కాశాల్ని ఇస్తూ ప్రోత్స‌హిస్తున్నారు వారికి నా ద‌న్య‌వాదాలు. ఈ చిత్రం న‌లుగు జీవితాల్ని ఎలా ప్ర‌భావితం చేస్తుంద‌నేది మెయిన్ కాన్సెప్ట్ వినోదం తో చెప్పాం. సెకండాఫ్ లో స‌ప్త‌గిరి చేసే అల్ల‌రి అంతాఇంతా కాదు. మారుతి గారి బ్యాన‌ర్ స‌ప్త‌గిరి అంటే న‌వ్వుల‌కి కొద‌వుండ‌దు. అలానే అంద‌రూ న‌టీన‌టులు సూప‌ర్బ్ గాన‌టించారు. జె.బి గారు అందించిన సూప‌ర్బ్ మ్యూజిక్ ని ఏప్రిల్ 22న విడుద‌ల చేస్తున్నాం. అలానే ఈ స‌మ్మ‌ర్ లో ఫ్యామిలి అంతా క‌లిసి చూసేలా మా క్లోజ్‌ఫ్రెండ్స్ చిత్రం వుంటుంది.'అన్నారు

  తారాగణం

  తారాగణం


  నందు, మ‌ధు నంద‌న్‌, అభిషేక్ మ‌హ‌ర్షి, న‌వీద్, మ‌దురిమ‌, కేషా. క్రాతి, షామిలి, భార్గ‌వి, స‌ప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, కుమార్‌సాయి త‌దిత‌రులు నటించిన

  తెర వెనక

  తెర వెనక


  ఈ చిత్రానికి ఆర్ట్‌:గోవింద్‌, పి.ఆర్.ఓ:ఏలూరు శ్రీను, కో-డైర‌క్ట‌ర్: గౌత‌మ్ మ‌న్న‌వ‌, సంగీతం: జె.బి, ఎడిటింగ్: ఉద్ద‌వ్‌.ఎస్‌.బి, కెమెరా: విశ్వ.డి.బి, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: దాస‌రి వెంక‌ట స‌తీష్‌, స‌హ‌-నిర్మాత‌లు: సందీప్ సేన‌న్‌, అనీష్‌.ఎమ్‌.థామ‌స్‌, నిర్మాత‌: కుమార్ అన్నంరెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: అరుణ్ ప‌వ‌ర్.

  English summary
  Madhurima is a South Indian Actress, acted in Tamil and Telugu Movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X