సినిమా పోతేనేం...పాప బిజీ
అజయ్ హీరోగా చేసిన ఆ ఒక్కడు సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన మధురిమకు వరస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా నచ్చావులే, రైడ్ చిత్రాల హీరో తనీష్ ప్రక్కన మౌనరాగం చిత్రంలో బుక్కయింది. అంతేగాక మరో రెండు చిత్రాల్లో సైతం ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. మౌనరాగం చిత్రాన్ని శానం నాగ అశోక్ కుమార్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. విజయ బాలాజీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తుండగా ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. దాంతో ఆ ఒక్కడు దర్శక, నిర్మాతలు తమ సినిమా ఫ్లాఫ్ టాక్ కు విచారపడాలో,తాము పరిచయం చేసిన ఆమెకు ఆఫర్స్ వచ్చాయని సంతోషపడాలో అర్ధం కాని స్ధితి ఏర్పడింది.
madhurima tanish ride aa okkadu ajay nachavule mounaragam ashok kumar nv prasad vijay balaji రాజ్ కుమార్ అజయ్ ఆ ఒక్కడు నచ్చావులే రైడ్ తనీష్


Click it and Unblock the Notifications